Friday, April 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్94 శాతం టీచర్లకు వ్యాక్సిన్ పూర్తి

94 శాతం టీచర్లకు వ్యాక్సిన్ పూర్తి

రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ఇప్పటికి 94శాతం మందికి  వాక్సిన్ పూర్తి చేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  డాక్టర్ ఆదిమూలపు సురేష్  తెలిపారు. కేవలం 15,083 మంది అనగా 6 శాతం ఉపాధ్యాయులకు మాత్రమే వాక్సిన్ వేయాల్సి ఉందని, త్వరలోనే వీరికి కూడా వ్యాక్సిన్ అందించి 100 శాతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశాఖపట్నం 100 శాతం వాక్సిన్ ప్రక్రియ పూర్తి కాగా కడపలో 99 శాతం, విజయనగరం, చిత్తూరు, నెల్లూరు లలో 98 శాతం చొప్పున ఉపాధ్యాయులు వాక్సిన్ వేయించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే 86 శాతం పూర్తయిందని, ఇక్కడ ఇంకా 4 వేల మందికి వాక్సిన్ వేయాల్సి ఉండగా వేగవంతం చేయాలని అధికారులకు సూచించామన్నారు. రాష్ట్రం మొత్తంలో సగటు 94 శాతం ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు మంత్రి సురేష్ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్