Monday, June 8, 2026
HomeTrending Newsరాజ్యసభ సభ్యుడిగా రవిచంద్ర ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా రవిచంద్ర ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా ఈ రోజు వద్దిరాజు రవి చంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. వద్దిరాజు తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, టీఆరెఎస్ పార్లమెంటరీ నాయకుడు కేకే, లోకసభ లో టీఆరెఎస్ నాయకుడు నామా నాగేశ్వర రావు, ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, తాతా మధు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వాసుదేవ రెడ్డి, నాగూర్ల వెంకన్న, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు రవి చంద్ర కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

ఆ తర్వాత రాష్ట్ర నేతలు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, వద్ది రాజు రవి చంద్ర ఏకగ్రీవంగా ఎన్నికై, ఈ రోజు ప్రమాణం చేయడం, మేమంతా రావడం ఆనందంగా ఉందన్నారు. పార్లమెంటులో రవి చంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల గొంతుక అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read రాజ్యసభకు జయంత్ చౌదరి…మాట నిలబెట్టుకున్న అఖిలేష్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular