Monday, June 8, 2026
HomeTrending Newsరాజ్యసభకు జయంత్ చౌదరి...మాట నిలబెట్టుకున్న అఖిలేష్

రాజ్యసభకు జయంత్ చౌదరి…మాట నిలబెట్టుకున్న అఖిలేష్

రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసేందుకు మిత్ర‌ప‌క్ష‌మైన రాష్ట్రీయ లోక్‌ద‌ళ్‌‌ అధ్యక్షుడు జయంత్ చౌదరీకే స‌మాజ్‌వాదీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ ఛాన్స్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌యంత్ చౌద‌రీని రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తాన‌ని అఖిలేశ్ మాట ఇచ్చారు. అఖిలేశ్ మొదట్లో వెనుకంజ వేశారు. జయంత్ స్థానంలో తన భార్య డింపుల్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలనుకున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌ర్నీ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేశారు. అందులో ఒక‌రు క‌పిల్ సిబ‌ల్‌, రెండో నేత జావేదీ అలీఖాన్.

వాస్తవానికి.. క‌పిల్ సిబ‌ల్ స్థానంలో జ‌యంత్ చౌద‌రీని రాజ్యసభకు పంపాల‌నే ప్ర‌తిపాద‌న ఉందని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. స‌మాజ్‌వాదీ సీనియ‌ర్ నేత ఆజంఖాన్ విడుద‌ల‌లో న్యాయ‌వాదిగా క‌పిల్ సిబ‌ల్ కీల‌క పాత్ర పోషించారు. దీంతో క‌పిల్ సిబ‌ల్‌ను రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని ఆజంఖాన్ పార్టీ చీఫ్ అఖిలేశ్‌పై విప‌రీత‌మైన ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకే అఖిలేశ్ త‌లొగ్గార‌ని తెలిసింది.

అయితే ఇప్పుడు.. మిత్రపక్షం జయంత్ చౌదరిని రాజ్యసభకు మూడో అభ్యర్థిగా ఎంపిక చేయాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించారు. పార్లమెంటు ఎగువ సభకు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఎంపిక కావచ్చని గతంలో ఊహాగానాలు వచ్చాయి. డింపుల్ యాదవ్ పేరును తొలగించినట్టు రిపోర్టులు వచ్చాయి. కలత చెందిన జయంత్ చౌదరికి ఈ రోజు (గురువారం) ఉదయం అఖిలేష్ యాదవ్ ఫోన్ చేసి రాజ్యసభకు పార్టీ తుది ఎంపికపై తెలియజేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : రాజ్యసభ స్థానం ఉపఎన్నికకు నోటిఫికేషన్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular