Tuesday, March 10, 2026
Homeసినిమాజ‌న‌వ‌రి 11నుండి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌లో ‘ఆద్య’

జ‌న‌వ‌రి 11నుండి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌లో ‘ఆద్య’

వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ త‌దిత‌రులు న‌టించ‌నున్న చిత్రం ‘ఆద్య‌’. శ్రీసత్యసాయిబాబా వారి ఆశీస్సులతో P.S.R. కుమార్ (బాబ్జి, వైజాగ్), S. రజినీకాంత్ నిర్మాతలుగా శ్రీసాయి లక్ష్మి క్రియేషన్స్, వింటేజ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ చిత్రం రూపొంద‌బోతోంది. డిఎస్కే స్క్రీన్ సమర్పణలో ఎం.ఆర్.కృష్ణ మామిడాల‌ దర్శకత్వం వ‌హిస్తున్న‌ చిత్రం ‘ఆద్య‌’. జ‌న‌వ‌రి 11 నుంచి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం `షికారు` త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ద్వితీయ‌ చిత్రం`ఆద్య. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ, విశ్వ కార్తీక్, హెబ్బ పటేల్, కన్నడ కిషోర్, అమితా రంగనాధన్, రాజా రవీంద్రా, సూర్య తదితరులు న‌టిస్తున్నారు. ఈ చిత్రం గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

Also Read : రాజ’శేఖర్’లో శివానీ రాజశేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular