Saturday, March 14, 2026
Homeసినిమాబాల‌కృష్ణ సినిమాలో వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్‌

బాల‌కృష్ణ సినిమాలో వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్‌

Varalakshmi in Balayya Movie: ‘అఖండ’ ‘ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత న‌టసింహా నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. బాల‌కృష్ణ స‌ర‌స‌న శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ ద్వారా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ శ‌ర‌త్ కుమార్ ని ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ చిత్రం న‌టిగా వరలక్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దీంతో టాలీవుడ్ లో పవర్ ఫుల్ పాత్రలకు జయమ్మ కేరాఫ్ అడ్రస్ గా మారింది. బాలకృష్ణ 107వ సినిమాలో మ‌రోసారి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది వ‌రల‌క్ష్మి. మాస్ హీరో మ‌రియు మాస్ ద‌ర్శ‌కుడు ఇద్దరూ కలిసి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమాతో మాంచి విందు భోజనాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.

న‌వీన్ ఎర్నేని, వై ర‌వి శంక‌ర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాట‌లు అందిస్తున్న ఈ చిత్రానికి రిషీ పంజాబీ సినిమాటోగ్ర‌ఫి, నవీన్ నూలీ ఎడిటింగ్‌, రామ్ లక్ష్మణ్ ఫైట్స్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారు.

Also Read : ‘అఖండ’కు  బాల‌య్య కెరీర్లోనే హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular