యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. నేడు ఆగస్టు 31న   ఉదయం 10.08 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేసి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సితార ఎంటర్ టైన్మెంట్స్.

చిత్ర కథ, సంభాషణల బలం స్పష్టంగా కనిపిస్తుంది టీజర్ లో. నాయకానాయికల పాత్రల మనస్తత్వాలు, అభిరుచులు,ఆలోచనలు, కథానుగుణంగా సాగే వినోదం, సంగీతం, నటీనటుల అభినయం టీజర్ లో ప్రతి క్షణం క(అ)నిపిస్తాయి. ఖచ్చితంగా ‘వరుడు కావలెను‘ చిత్రాన్ని ప్రేమ కథా చిత్రాలలో ప్రత్యేకంగా చూసేలా చేస్తాయి. ఓ ఫీల్ గుడ్ మూవీని చూడబోతున్నామన్న ఆసక్తిని కలిగిస్తుంది ఈ టీజర్. చివరలో హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. అక్టోబర్ నెలలో ఈ సినిమా ధియేటర్లలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *