Friday, April 19, 2024
Homeఫీచర్స్ఆయన్ను వదిలేసి వెళ్లనా?

ఆయన్ను వదిలేసి వెళ్లనా?

Family Counselling :

Q.మా ఆయన యీమధ్యే రిటైర్ అయ్యారు. మొదటినుంచీ ఆయనది విపరీత మనస్తత్వం. అన్నీ తను అనుకున్నట్టే జరగాలి . ఏ కొంచెం తేడా వచ్చినా అందరినీ తిట్టి, అరచి రభస చేస్తారు. పిల్లలకు ఈ పద్ధతి నచ్చక ఉద్యోగాల పేరుతో దూరంగా వెళ్లిపోయారు. వాళ్ళు వచ్చినపుడైనా సరిగా ఉంటారా అంటే అదీ లేదు . వాళ్ళని, మనుమల్ని విసుక్కుంటారు. దాంతో నాలుగురోజులు ఉండాల్సినవారు రెండు రోజులకే వెళ్ళిపోతారు. ఎవరితో నైనా ఇదే పధ్ధతి. ఇన్నాళ్లు భరించినా ఇపుడు నా వల్ల కాదనిపిస్తోంది. పిల్లల దగ్గరకి వెళ్లిపోవాలనిపిస్తోంది. కానీ వదిలి వెళ్లాలన్నా బాధగా ఉంది. ఆయనకీ విషయం తెలిసేలా, ప్రవర్తన మారేలా సలహా ఇవ్వండి.
-లక్ష్మి

A.మన దగ్గర నూటికి అరవై మంది ఎదుర్కొనే పరిస్థితి ఇది. ఇప్పుడు చాలామంది మారుతున్నారు గానీ ఒక తరం ముందున్నవారు ఇలాగే ఉన్నారు. అయితే
మీరు రాసిందాన్ని బట్టి నాకు అర్థమైంది ఇన్నేళ్ళలో మీరుగాని, పిల్లలు గానీ సర్దుకుపోయారే తప్ప , సున్నితంగానైనా చెప్పినట్టులేరు. అసలుకన్న వడ్డీ ముద్దు కాబట్టి మనవల్ని విసుక్కుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయనతో ఇన్నేళ్ల మీ బాధని కక్కేయండి. అంతే కాదు తన ప్రవర్తనతో పిల్లల్ని ఎంత దూరం చేసుకుంటున్నారో చెప్పండి. మీరు రాసిన ఈ ఉత్తరం చూపించినా చాలు. విషయం అర్థమవుతుంది. ఏమీ చెప్పకుండా మీరు కూడా ఆయన్ని వదిలి వెళ్లడం ఈ వయసులో భావ్యం కాదు. ఎక్కడికైనా మీరిద్దరూ కలసి వెళ్లడమే ఉత్తమం. అంతకుముందు ఆయన మారితేనే అది సాధ్యమని స్పష్టంగా చెప్పండి. ఇన్నాళ్లూ బాధ్యతలతో లెక్క చేయకపోయినా ఇప్పుడు తప్పక మీ మాట వింటారు.

Family Counselling

-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
shobhas292@gmail.com

Also Read: 

ఆయన్ను వదిలేసి వెళ్లనా?

Also Read: 

అమెరికాలో అయోమయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్