Thursday, May 30, 2024
Homeఫీచర్స్అమెరికాలో అయోమయం

అమెరికాలో అయోమయం

Family Counselling :

Q.నేను ఏడేళ్లక్రితం బీటెక్ పూర్తిచేశాను. అయిదేళ్లక్రితం పెళ్లయింది. మా వారికి అమెరికాలో ఉద్యోగం. పెళ్లయినప్పటినుంచి అక్కడే ఉంటున్నాం. మూడేళ్ళ బాబు ఉన్నాడు. మా అత్తమామలు హైదరాబాద్ లో ఉంటారు. నేను ఉద్యోగం చెయ్యడం లేదని మా వారు, అత్తగారు నన్ను మాటలతో హింసిస్తున్నారు. ఒక్కోసారి మా వారు అనే మాటలకి డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటాను. వాళ్ళది బాగా సెటిల్ అయిన కుటుంబమే. నేను జాబ్ చెయ్యకపోతే ఇండియా వెళ్లిపోదామంటున్నారు మా ఆయన. అక్కడికెళ్లి అత్తగారి మాటలు భరిస్తూ ఉండలేను. నాకూ ఉద్యోగం చేయాలనే ఉంది. కానీ గైడెన్స్ లేదు. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియడం లేదు. ఈ విషయంలో నా భర్త నుంచి ఏ సహాయం లేదు.
-కమల

A.బహుశా చదువైన వెంటనే పెళ్లి కోసం తొందర చేసి ఉంటారు మీ ఇంట్లో. లేకపోతే ఈ రోజుల్లో ఎవరూ ఉద్యోగం లేకుండా ఉండటం లేదు. మీరుకూడా అమెరికాలో అలవాటుపడేలోగానే బాబు బాధ్యతతో బిజీ అయి ఉంటారు. అయితే ఇవన్నీ మీ వారికి, అత్తగారికి తెలిసిన విషయాలే కదా! ఎందుకు మిమ్మల్ని తప్పు పడుతున్నారు? చాలామంది పెళ్లయి, పిల్లలు పుట్టగానే ఇక చెయ్యడానికేమీ లేదన్నట్టు ఉంటారు. ఈ రోజుల్లో ఇద్దరూ పనిచేస్తేనే విదేశాల్లో సుఖంగా ఉండగలరు. బీటెక్ చదివిన మీకు తెలిసే ఉండాలి. ఆ ఒత్తిడిలో మీ భర్త ఏదన్నా అన్నారేమో? నిజానికి చాలామంది ఇంట్లోనుంచే పనిచేస్తున్నారు. ప్రయత్నిస్తే అదేమీ కష్టం కాదు. మీతో చదువుకున్న వారు, స్నేహితులు ఉంటే సంప్రదించండి. మీ ఆసక్తిని బట్టి ఎటువంటి ఉద్యోగం కోరుకుంటున్నారో నిర్ణయించుకోండి. అవసరమైతే కొత్త కోర్సులు నేర్చుకోండి. లేదా జాబ్ ప్లేస్ మెంట్ సంస్థలను సంప్రదించండి. మనసుండాలే గానీ ఎన్నో రకాల ఉద్యోగాలు. జాబ్ వచ్చేలోపు మీకంటూ వ్యాపకం పెట్టుకోండి. ఆరోగ్యం, వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వండి. అంతే గానీ మీ భర్త అన్నారనో అత్తగారు తిట్టారనో బాధపడుతూ కూర్చుంటే మీకు మరింత నష్టం. ఒకసారి మీ భర్తతో వివరంగా మాట్లాడి నిర్ణయించుకోండి.

Family Counselling

-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]

Also Read:

కష్టాల నడుమ సంతోషాలకు దారేది?

RELATED ARTICLES

Most Popular

న్యూస్