Friday, March 29, 2024
HomeTrending Newsకెసిఆర్ పథకాలు ఎన్నికల కోసమే

కెసిఆర్ పథకాలు ఎన్నికల కోసమే

ముఖ్యమంత్రి దత్తత గ్రామాల్లో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దత్తత పేరుతో మొదటి రోజు హడావిడి చేసి ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి హామీలు అమలు చేసినట్టు రుజువు చేస్తే తన ఎంపి పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అన్ని కులాల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి నిజాలు నిగ్గు తేలుద్దామన్నారు. మూడుచింతలపల్లి లో రెండు రోజుల దళిత, గిరిజనుల ఆత్మగౌరవ దీక్ష మొదటి రోజు రేవంత్ రెడ్డి ఘాటైన పదజాలంతో కెసిఆర్ ను విమర్శించారు.

ఇన్నాళ్ళు ఇంట్లో కూర్చున్న కెసిఆర్ ఈ రోజు కాంగ్రెస్ దీక్ష ఉందని పార్టీ సమావేశం పెట్టారు. కేవలం కాంగ్రెస్ దీక్ష కవర్ కావద్దనే ఈ పన్నాగం పన్నారని ఆరోపించారు. కెసిఆర్ దత్తత తీసుకున్న ముడుచింతల పల్లి, లక్ష్మారెడ్డి పల్లి, చిన్న ముల్కనూర్, ఎర్రవల్లి గ్రామాల్లో అభివృద్ధి కాగితాలకే పరిమితం అయిందన్నారు.

కెసిఆర్ పాలనలో స్థానిక సంస్థల ప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాకపోవటంతో కూలి పనులు చేసే దుస్తితి నెలకొంది. ఏడున్నర సంవత్సర కెసిఆర్ పాలనలో ప్రజల నెత్తిమీద అప్పులు మాత్రమె మిగిలాయి. పదవులు కెసిఆర్ ఇంటికి మాత్రమె పరిమితం అయ్యాయి. ఎన్నికలు రావటంతో హుజురాబాద్ లో దళితులకు పది లక్షలు అంటున్నాడు కెసిఆర్.

దళిత, గిరిజనుల కోసం కాంగ్రెస్ సబ్ ప్లాన్ తీసుకొస్తే దాన్ని నిర్వీర్యం చేశాడు. ఎస్.సి కార్పొరేషన్ కు నిధులు విడుదల చేయకపోవటంతో నాలుగు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కెసిఆర్ పాలన బీడీకి బిచ్చమెత్తుకొని కల్లుకు ఉద్దేర పెట్టినట్టుగా ఉంది. గ్రేటర్ ఎన్నికల కోసం పది వేల వరద సాయం అని చెప్పి నిజంగా నష్టపోయినవారిని వదిలేసి మూడో అంతస్తులో ఉండే తెరాస కార్యకర్తలకు డబ్బులు అందించారు. కెసిఆర్ పథకాలన్నీ కేవలం ఎన్నికల కోసమే అని రేవంత్ ఆరోపించారు. కెసిఆర్ కుట్రలను హుజురాబాద్ ప్రజలు గమనించాలని వేడుకుంటున్న. కెసిఆర్ ఇచ్చే పది లక్షలు  దానం కాదు అవి దళితుల హక్కుగా భావించాలి.

హుజురాబాద్ ప్రజలు, దళితులు వేసే ఓటు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో కేసులు వేయించి కెసిఆర్ డ్రామా చేస్తాడని రేవంత్ అన్నారు. మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే డిస్కో అన్నట్టుంది  కెసిఆర్ తీరు అని రేవంత్ ఎద్దేవా చేశారు. కులవృత్తులకు సాయం పేరుతో వారిని మరింత వెనుకబాటుకు కెసిఆర్ కుట్ర చేశాడని ఆరోపించారు. వెనుకపడిన కులాల విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనేది కాంగ్రెస్ లక్ష్యమన్నారు.

ఈటెల రాజేందర్ నేరగాడు జైల్లో పెడతామన్న కెసిఆర్ మాటలు ఏమయ్యాయి. బిజెపి తెరాస రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ – తెలంగాణ కేడీ ఒక్కటై రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు.

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మల్లీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో సోనియాగాంధి రాజ్యం తీసుకొస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్