Varun New film: వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ, యూత్ పల్స్ తెలుసుకుని ముందుకు సాగుతున్న ట్రెండీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్. ఆయన తాజాగా మరో సబ్జెక్ట్ ని ఓకే చేశారు. వరుణ్ నటిస్తున్న 12వ సినిమా ప్రారంభోత్సవం సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఆత్మీయుల సమక్షంలో జరిగింది. జెన్ నెక్స్ట్ కథలతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమాలు తెరకెక్కిస్తారనే పేరున్న ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నాగబాబు కొణిదెల సమర్పణలో బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు.
