Sunday, January 19, 2025
Homeసినిమా100 కోట్లకి పైగా కొల్లగొట్టిన వీరయ్య .. వీరసింహారెడ్డి!

100 కోట్లకి పైగా కొల్లగొట్టిన వీరయ్య .. వీరసింహారెడ్డి!

చిరంజీవి – బాలకృష్ణ ఇద్దరూ కూడా సినిమాల పరంగా థియేటర్ల దగ్గర పోటీపడిన సందర్భాలు  ఉన్నాయి. అయితే ఈ సారి ఒక గమ్మత్తు జరిగింది. ఈ ఇద్దరి సినిమాలు ఒకే బ్యానర్లో సంక్రాంతి బరిలో దిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రెండు సినిమాలలో ‘వీరసింహారెడ్డి’ ఈ నెల 12వ తేదీన విడుదలైతే, 13వ తేదీన ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు సినిమాలు కూడా భారీ ఓపెనింగ్స్ తో మొదలయ్యాయి.

‘వాల్తేరు వీరయ్య’ 3 రోజుల్లో 108 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఇక ‘వీరసింహారెడ్డి’ విషయానికొస్తే, తొలిరోజునే 54 కోట్ల వసూళ్లు వచ్చాయి. మిగతా మూడు రోజులకు కలుపుకుని ఈ సినిమా 104 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.

బ్యానర్ విషయంలోనే కాకుండా రెండు సినిమాల మధ్య కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి.  రెండు సినిమాలు కూడా యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నడిచినవే. మాస్ డాన్సులతో అలరించినవే. కొరియోగ్రఫర్ గా శేఖర్ మాస్టర్ .. ఫైట్ మాస్టర్స్ గా రామ్ – లక్ష్మణ్ ఈ రెండు సినిమాలకీ పనిచేశారు. రెండు సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ పాప్యులర్ అయ్యాయి. రెండు సినిమాల్లోను హీరో ఒక ముఖ్యమైన పనిమీద విదేశాలకి వెళతాడు. ఇలాంటి అంశాలలో పోలిక కనిపిస్తుంది. మొత్తానికి సంక్రాంతి బరిలోకి దిగిన ఈ రెండు పెద్ద సినిమాలు 3 .. 4 రోజుల్లోనే 100 కోట్లకి పైగా వసూలు చేయడం విశేషంగా చెప్పు కోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్