Tuesday, April 16, 2024
HomeTrending Newsఎమ్మెల్యే పౌరసత్వంపై హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యే పౌరసత్వంపై హైకోర్టులో విచారణ

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. చెన్నమనేని పౌరసత్వం కేసు డైరీ ని తెలపడానికి భౌతికంగా వాదనలు వినాలని కోర్టును కోరిన చెన్నమనేని న్యాయవాది వై. రామారావు. భౌతికంగా వాదనలు వినిపించడానికి సుముఖంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వo, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావులు సమ్మతించారు.

అనేక రకమైన అఫిడవిట్ లు, మెమోలు, కేస్ లాస్ ఉన్నందున వాదనలకు అన్ని పార్టీలు  భౌతికంగా వాదన చేయడానికి సిద్ధంగా ఉండాలన్న  హైకోర్ట్. అభ్యంతరం వ్యక్తం చేసిన ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ రావు. ఇప్పటికే కేసు చాలా జాప్యం జరుగుతోందని, వెంటనే కోర్ట్  వాదనలు పూర్తి చేసి ఆదేశాలు ఇవ్వాలని కోరిన సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ రావు. అక్టోబర్ 21న భౌతిక వాదనలు జరుపుతామన్న హైకోర్టు. తదుపరి విచారణను అక్టోబర్ 21వ తేదికి వాయిదా వేసిన హైకోర్టు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్