Wednesday, March 18, 2026
Homeసినిమామొత్తానికి వెంకీ గ్రీన్ సిగ్న‌ల్!

మొత్తానికి వెంకీ గ్రీన్ సిగ్న‌ల్!

సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌.. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు కానీ.. వెంక‌టేష్ మాత్రం కొత్త సినిమాని ప్ర‌క‌టించ‌లేదు. ఎఫ్ 3 త‌ర్వాత వెంకీ ఇప్ప‌టివ‌ర‌కూ తన కొత్త సినిమా ఏమిటనేది ప్రకటించలేదు.  బాలీవుడ్ లో మాత్రం సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న ‘కభీ ఈద్ కభీ దివాళీ’ లో నటిస్తున్నారు. తమిళ హిట్ మూవీ వీరం ఆధారంగా ఈ మూవీని సల్మాన్ ఖాన్-సాజిద్ నదియావాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో పాటు నెట్ ఫ్లిక్స్ కోసం రానాతో కలిసి రానా నాయుడు వెబ్ డ్రామాలో నటిస్తున్నారు. ఇది షూటింగ్ఈ పూర్తి చేసుకుంది. అయినా వెంకటేష్ తెలుగు సినిమాని అనౌన్స్ చేయ‌లేదు.

తాజాగా డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మించబోతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. అలాగే తమిళ హిట్ మూవీ ఓ మై కడవులే ఆధారంగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న మూవీ ‘ఓరి దేవుడా!’. ఈ మూవీలోని విజయ్ సేతుపతి పాత్రలో వెంకటేష్ గెస్ట్ పాత్రలో కనిపించనున్నారని స‌మాచారం.

Also Read : శ్రీకాంత్ అడ్డాల నెక్ట్స్ మూవీ హీరో ఎవరు? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular