Monday, May 20, 2024
Homeసినిమాఅన్‌ స్టాపబుల్ 2’లో వెంకటేష్ ?

అన్‌ స్టాపబుల్ 2’లో వెంకటేష్ ?

బాలకృష్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ‘అన్ స్టాపబుల్‘ అంటూ ఓటీటీలో టాక్ షో చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ హోస్ట్ గా చేసిన బాలయ్య తనదైన స్టైల్ లో ఇంటర్ వ్యూలు చేయడం.. వీటికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే. దీంతో ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ పై మరింత క్రేజ్ ఏర్పడింది. నారా చంద్రబాబు నాయుడుని ఇంటర్ వ్యూ చేయడంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 స్టార్ట్ చేశారు. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆతర్వాత ఎపిసోడ్ లో విశ్వ‌క్ సేన్‌, సిద్దు జొన్న‌లగ‌డ్డ అన్‌స్టాప‌బుల్ షోకి గెస్ట్ లుగా వచ్చారు.

అయితే.. ఇప్పుడు ఈ టాక్ షోకి మరో స్టార్ హీరో గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. వెంకీని బాలయ్య ఇంటర్ వ్యూ చేస్తే.. చాలా ఎంటర్ టైనింగ్ గా.. ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అందుకనే ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం ‘ఆహా’ టీమ్ చాలా వర్క్ చేస్తుందట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి వెంకీని బాలయ్య ఏ ఏ ప్రశ్నలు అడగనున్నారు..?  వెంకీ తనదైన స్టైల్ లో ఎలాంటి సమాధానాలు ఇవ్వనున్నారు..? అనేది ఆసక్తిగా మారింది. బాలయ్య,  వెంకీ నటించిన కొన్ని కామెడీ సన్నివేశాల పై పలు ఆసక్తికర విషయాలు పంచుకోనున్నారని తెలిసింది.

ఈ ఇంట్రస్టింగ్ ఎపిసోడ్ ఎప్పుడు రాబోతుంది అనేది త్వరలో క్లారిటీ రానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రానికి  గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ కు అనూహ్య స్పందన వచ్చింది. సంక్రాంతికి వీరసింహారెడ్డి రిలీజ్ కానుంది. మరి.. ఇటీవల అన్ స్టాపబుల్ టాక్ తో మరోసారి మెప్పించిన బాలయ్య వీరసింహారెడ్డి మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

Also Read : కొంచెం చిలిపి-మరికొంత సీరియస్: బాబుతో బాలయ్య ‘అన్ స్టాపబుల్’

RELATED ARTICLES

Most Popular

న్యూస్