Sunday, January 19, 2025
HomeTrending Newsనాడు-నేడులో అవినీతి: అచ్చెన్నాయుడు

నాడు-నేడులో అవినీతి: అచ్చెన్నాయుడు

Corruption Allegations:
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, 10 రూపాయల పనికి 100 రూపాయలు దోపిడీ చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. టిడిపి అనుబంధ విద్యార్థి సంస్థ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క అవకాశం పేరిట దరిద్రాన్ని తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు.

విదేశీ విద్యాదీపన కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేస్తారా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే విదేశాల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏమి కావాలని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు జాబ్ లెస్ క్యాలండర్ ఇచ్చారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ళలోనే మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని, కానీ ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలే లేవని మండిపడ్డారు.

ఎవరు ఎన్ని చట్టాలు చేసినా రాష్ట్రానికి అమరావతే రాజధానిగా కొనసాగుతుందని అయన స్పష్టం చేశారు. రాజధాని కోసం మహిళలు చేస్తున్న పోరాటం అభినందనీయమని కొనియాడారు. రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న రైతులు, మహిళలు బస చేసే ప్రాంతాన్ని ట్రాక్టర్లతో దున్నించడం అమానుషమన్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న మహిళల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్లను తొలగించడం దుర్మార్గమైన చర్యగా అయన అభివర్ణించారు. ఎప్పుతూ ఎన్నికలు జరిగినా టిడిపి 150 సీట్లు గెల్చుకొని అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read : స‌రికొత్త రికార్డుల సాధిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైల‌ర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్