Sunday, January 19, 2025
Homeసినిమాలైగ‌ర్ ట్రైల‌ర్ పై వంగా రియాక్ష‌న్

లైగ‌ర్ ట్రైల‌ర్ పై వంగా రియాక్ష‌న్

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘లైగ‌ర్‘. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి మూవీ ఎప్పుడు  వ‌స్తుందా అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. హైద‌రాబాద్ సుద‌ర్శ‌న్ థియేట‌ర్లో అభిమానుల స‌మ‌క్షంలో నిన్న విడుదల చేసిన ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ లభిస్తోంది.

 దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా తన మాస్ రియాక్షన్ ని తెలియజేసి రౌడీ హీరో ఫాన్స్ లో జోష్ నింపారు. “ఒచ్చిండు చూడు మావోడు” అంటూ విజయ్, దర్శకుడు పూరి జగన్నాథ్ లు అదిరే సింక్ లో ఉన్నారని ఖచ్చితంగా లైగర్ ఒక మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అనుకుంటున్నా… చిత్ర యూనిట్ కి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా’  అన్నారు.

ట్రైల‌ర్ కు వ‌చ్చిన రెస్పాన్స్ చూస్తుంటే.. లైగ‌ర్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం ఖాయమనిపిస్తుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్ చెప్పిన‌ట్టుగానే ఆగ‌ష్టు 25న లైగ‌ర్ మూవీతో ఇండియా షేక్ అవ్వ‌డం ఖాయం అంటున్నారు సినీజ‌నాలు. మ‌రి.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర లైగ‌ర్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

Also Read : పక్కా మాస్ లుక్ తో రమ్యకృష్ణ విజృంభించనుందా?  

RELATED ARTICLES

Most Popular

న్యూస్