Saturday, April 20, 2024
Homeసినిమాఆ స్టార్ హీరో బుచ్చిబాబుకు నో చెప్పాడా..?

ఆ స్టార్ హీరో బుచ్చిబాబుకు నో చెప్పాడా..?

చిన్న సినిమాగా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన సినిమా ఉప్పెన‌. ఈ సినిమాతో మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్, కృతిశెట్టి తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. 100 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీతో క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. దీంతో బుచ్చిబాబుతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు.

అయితే.. బుచ్చిబాబు మాత్రం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. ‘ఉప్పెన’ త‌ర్వాత నుంచి ఎన్టీఆర్ తో చేయ‌నున్న సినిమా క‌థ పైనే వ‌ర్క్ చేశారు. ఎన్టీఆర్ కి క‌థ న‌చ్చింద‌ని.. అయితే.. ఈ సినిమాను కొర‌టాల‌తో చేస్తున్న సినిమా త‌ర్వాత చేస్తాన‌ని చెప్పార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కొర‌టాల‌తో ఎన్టీఆర్ మూవీ ఇంకా సెట్స్ పైకి రాలేదు. అందుచేత బుచ్చిబాబుతో ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి రావ‌డానికి చాలా టైమ్ ప‌డుతుంది.

అందుచేత బుచ్చిబాబు వేరే హీరోతో సినిమా చేయాలి అనుకుంటున్నార‌ట‌. ఇటీవ‌ల సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను క‌లిసి క‌థ చెప్పార‌ట‌. అయితే.. ‘లైగ‌ర్’ మూవీతో డిజాస్ట‌ర్ చూసిన విజ‌య్ దేవ‌ర‌కొండ బుచ్చిబాబు చెప్పిన స్టోరీ త‌న‌కు సెట్ కాద‌ని చెప్పి సున్నితంగా తిర‌స్క‌రించార‌ట. దీంతో బుచ్చిబాబు మ‌ళ్లీ ఆలోచ‌న‌లోప‌డ్డార‌ట‌. తొలి సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసిన సినిమాని అందించిన‌ప్ప‌టికీ… ఇంకా రెండో సినిమా సెట్ కాలేదు. మ‌రి.. బుచ్చిబాబు రెండో సినిమా ఎవ‌రితో సెట్ అవుతుందో చూడాలి.

Also Read : బుచ్చిబాబును టెన్ష‌న్ పెడుతున్న ఎన్టీఆర్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్