Friday, March 6, 2026
Homeసినిమాఇన్ స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డు

ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డు

ఎవడే సుబ్రమణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం… ఇలా విభిన్న కథా చిత్రాల్లో తనదైన శైలిలో నటించి యూత్ ని బాగా మెప్పించి సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అనతి కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. తన సినిమాలతో సౌత్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. పూరి – ఛార్మి – కరణ్ జోహర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే… యంగ్ స్టార్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మరో రేర్ ఫీట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో 12 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్నారు. దీంతో మొత్తం దక్షిణాదిలో ఇన్ స్టాగ్రామ్ లో 12 మిలియన్ ఫాలోవర్స్ పొందిన ఏకైక స్టార్ గా విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. దేశ వ్యాప్తంగా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ కు ఇది నిదర్శనంగా చెప్పచ్చు. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం చేస్తున్నలైగర్ మూవీ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. అలాగే శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular