0.1 C
New York
Thursday, December 7, 2023

Buy now

Homeసినిమా‘టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్’ విజయ్ దేవరకొండ

‘టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్’ విజయ్ దేవరకొండ

బాలీవుడ్ స్టార్స్ ను మించిన క్రేజ్, స్టార్ క్రికెటర్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ టాలీవుడ్ స్టార్ రీసెంట్ గా హైదరాబాద్ “టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్” గా టాప్ ప్లేస్ సంపాదించుకోగా..ఇప్పుడు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50″ లో జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకున్నారు. గత ఏడాది మూడో ప్లేస్ లో ఉన్న విజయ్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. రన్వీర్ సింగ్, వికీ కౌషల్, రణ్ బీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ అంతా విజయ్ వెనకే ఉండిపోయారు.

ఆన్ లైన్ ఓటింగ్, జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల్లోని సెలబ్రిటీలను టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ తయారు చేసింది టైమ్స్ గ్రూప్. నేషనల్ వైడ్ గా జరిగిన ఆన్ లైన్ ఓటింగ్ లో దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి స్థానం దక్కించుకోగా…రెండో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచారు. ఆదిత్య రాయ్ కపూర్, వికీ కౌశల్, దుల్కర్ సల్మాన్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.

“అర్జున్ రెడ్డి” సినిమా హిందీ రీమేక్ “కబీర్ సింగ్” తో బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ బాగా పరిచయం అయ్యారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా “లైగర్” తో హిందీ పరిశ్రమకు విజయ్ దేవరకొండ మరింత దగ్గరవుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్