Saturday, January 18, 2025
Homeసినిమావిజ‌య్, స‌మంత మూవీకి  ప‌వ‌ర్ స్టార్ టైటిల్?

విజ‌య్, స‌మంత మూవీకి  ప‌వ‌ర్ స్టార్ టైటిల్?

another Khushi: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం సెట్ అయ్యింది. ఈ చిత్రానికి ‘నిన్నుకోరి’, ‘మ‌జిలీ’, ‘టక్ జ‌గ‌దీష్’ చిత్రాల ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ మూవీ ఎప్ప‌టి నుంచో వార్త‌ల్లో ఉంది కానీ.. ఇంకా అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని ఈ నెల 21 పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించి, 23 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుందని తెలిసింది.

ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ చిత్రం ఫ‌స్ట్ షెడ్యూల్ ను కాశ్మీర్లో ప్లాన్ చేశారు. ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీగా రూపొందే ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. మ‌హాన‌టి సినిమా త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ చిత్రానికి ప‌వన్ క‌ళ్యాణ్ మూవీ టైటిల్ ఖుషి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతానికి ఖుషి అనేది వ‌ర్కింగ్ టైటిల్. ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా?  లేక మారుస్తారా? అనేది తెలియాల్సివుంది. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది.  మ‌రి మూవీతో విజ‌య్, శివ నిర్వాణ ఏ స్థాయి విజ‌యం సాధిస్తారో చూడాలి.

Also Read : విజ‌య్ దేవ‌ర‌కొండ స‌రికొత్త రికార్డ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్