Friday, May 31, 2024
Homeసినిమానారాయ‌ణ్ దాస్ నారంగ్ ఇక‌లేరు.

నారాయ‌ణ్ దాస్ నారంగ్ ఇక‌లేరు.

Narayan Das no more: ప్ర‌ముఖ నిర్మాత‌, తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ ప్రెసిడెంట్, ఏసియ‌న్ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ అధినేత నారాయ‌ణ్ దాస్ నారంగ్ ఈరోజు క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 78 సంవ‌త్స‌రాలు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఇటీవ‌ల స్టార్ హాస్ప‌ట‌ల్ లో చేరారు. ఈరోజు ఆయ‌న తుది శ్వాస విడిచారు.

ఆయ‌న అక్కినేని నాగ‌చైత‌న్య‌తో ల‌వ్ స్టోరీ, నాగ‌శౌర్య‌తో ల‌క్ష్య చిత్రాల‌ను నిర్మించారు. ప్ర‌స్తుతం అక్కినేని నాగార్జున‌తో ఘోస్ట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే త‌మిళ హీరో ధ‌నుష్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అలాగే ప‌లు భారీ చిత్రాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఆయ‌న చ‌నిపోవ‌డం ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు షాక్ అని చెప్ప‌చ్చు. ఆయ‌న మ‌ర‌ణం ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటు అని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్