Sunday, January 19, 2025
HomeTrending Newsనవంబర్ 29న విజయ గర్జన సభ

నవంబర్ 29న విజయ గర్జన సభ

Vijaya Garjana Sabha On November 29 :

నవంబర్ 15 న జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ ధీక్షా దివస్ అయిన నవంబర్ 29 వ తేదీన నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్ సమావేశంలో ముక్త కంఠంతో చేసిన అభ్యర్థన మేరకు సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.
నాటి ఉద్యమ రథసారథిగా తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో ’ అనే నినాదంతో సిఎం కెసిఆర్ ప్రారంభించిన ధీక్షా దివస్’ నవంబర్ 29 తేదీయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు తమ అభిప్రాయాలను సిఎం కెసిఆర్ కు విన్నవించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ విజయ గర్జన సభను విజయవంతం చేయడానికి ఇప్పటికే కమిటీలు వేసుకోని ఏర్పాట్లల్లో నిమగ్నమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల టిఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని గమనించాలని సిఎం తెలిపారు. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను (ఈ నెల) నవంబర్ 29 వ తేదీకి మార్చుకోవాలని సిఎం సూచించారు. తేదీ మార్పు విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియచేయాలన్నారు.

Must Read :తెలంగాణ ఫ్రాన్స్ డిజిటల్ పార్టనర్ షిప్

RELATED ARTICLES

Most Popular

న్యూస్