Sunday, January 19, 2025
Homeసినిమామళ్లీ రంగంలోకి దిగుతున్న లేడీ సూపర్ స్టార్?

మళ్లీ రంగంలోకి దిగుతున్న లేడీ సూపర్ స్టార్?

ఒకానొక దశలో టాలీవుడ్ ను విజయశాంతి ఏలేశారు. టాప్ హీరోయిన్ గా అత్యధిక పారితోషికాన్ని అందుకున్నారు.  దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. నటన విషయంలోను .. డాన్సుల విషయంలోను వంకబెట్టనవసరం లేదు అనిపించుకున్నారు. ఆమె చేసిన నాయిక ప్రధానమైన సినిమాలు, స్టార్ల హీరోల సినిమాలతో సమానంగా ఆదరణ పొందాయి. యాక్షన్ విషయంలోను తెరపై ఒక రేంజ్ లో విజృంభిస్తూ, లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. అప్పట్లో రాధ .. భానుప్రియ .. సుహాసిని వంటి వారి నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, తానే నెంబర్ వన్ పొజీషన్ లో నిలబడ్డారు.

ఆ తరువాత ఆమె రాజకీయాలలోకి వెళ్లడం వలన సినిమాలను పక్కన పెట్టారు. రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ చేస్తూ వెళ్లారు. విజయశాంతి అభిమానులంతా కూడా ఈ విషయంలో చాలా నిరాశపడ్డారు. చాలా గ్యాప్ తరువాత ఆమెను అనిల్ రావిపూడి ఒప్పించి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం తీసుకుని వచ్చాడు. దాంతో ఆమె పాత్ర చాలా కీలకం అయ్యుంటుందని అంతా అనుకున్నారు. ఆ సినిమా హిట్ అయినప్పటికీ, విజయశాంతి స్థాయికి తగిన పాత్ర కాదేమోనని అనుకున్నారు. ఆమె పాత్రలో అంత  పవర్ లేదని చెప్పుకున్నారు. ఈ సినిమా తరువాత విజయాశాంతి నటనను కొనసాగిస్తారా .. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం విజయశాంతి భారీ పారితోషికం తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ స్థాయి పారితోషికం ఇవ్వలేక నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారనే టాక్ వచ్చింది. కానీ తనకి తగిన పాత్ర వస్తేనే చేస్తాను అంటూ ఇంటర్వ్యూలలో వియజయశాంతి చెప్పుకుంటూ వచ్చారు. మళ్లీ ఇప్పుడు ఆమె ఎన్టీఆర్ – కొరటాల సినిమా కోసం రంగంలోకి దిగులుతున్నట్టుగా టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ అత్త పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అందువలన విజయశాంతిని తీసుకున్నారని అంటున్నారు. అదే నిజమైతే ఈ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ల్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్