Saturday, June 13, 2026
Homeసినిమా విజువల్ ట్రీట్‌గా 'విక్కీ ది రాక్ స్టార్' ఫస్ట్ షేడ్

 విజువల్ ట్రీట్‌గా ‘విక్కీ ది రాక్ స్టార్’ ఫస్ట్ షేడ్

విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ‘విక్కి ది రాక్ స్టార్‘ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీ రూపొందుతోంది. హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో 87 ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా బాధ్యతలు చేపట్టారు. భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌‌గా వ్యవహరిస్తుండగా.. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ బాణీలు అందించారు.

తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఫస్ట్ షేడ్‌ను విడుదల చేశారు. ‘ఫస్ట్ లవ్.. జీవితంలో ఎవరికైనా ఫస్ట్ లవ్ మిగిల్చే జ్ఞాపకాలు మరవడం కష్టం.. అవి మరిస్తే ఒక వరం.. మరవలేకపోతేనే మరణం.. వాటిని మరిచేదెలా.. మరిచి బ్రతికేదెలా.. అమృతా’ అంటూ సాగే ఈ ఫస్ట్ షేడ్‌లో ఎంతో ఎమోషనల్ కంటెంట్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎమోషనల్ కంటెంట్‌కు తగ్గట్టుగా సునీల్ కశ్యప్ మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు.

గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రాక్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియో విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరూ చేయని జానర్‌ని టచ్ చేస్తూ ఈ సినిమా రూపొందించారని ఇప్పటికే వదిలిన అప్డేట్స్ తెలుపుతున్నాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టచ్ చేస్తూ నేటితరం ఆడియన్స్ కోరుకునే స్టఫ్‌తో ఈ మూవీని సిద్ధం చేస్తున్నారని స్పష్టమవుతోంది. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular