Sunday, January 19, 2025
HomeTrending Newsటెస్ట్ కెప్టెన్సీ కి కోహ్లీ గుడ్ బై!

టెస్ట్ కెప్టెన్సీ కి కోహ్లీ గుడ్ బై!

Virat – quit: విరాట్ కోహ్లీ టెస్ట్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో ఇండియా ఓటమిపాలైన మర్నాడే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

టి 20 కెప్టెన్ గా తాను వైదొలుగుతానని వరల్డ్ కప్ టి20 టోర్నీకి ప్రారంభం కావడానికి వారం రోజుల ముందు  విరాట్ కోహ్లీ  ప్రకటన చేసి సంచలనం సృష్టించాడు. బిసిసిఐ కూడా కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత కోహ్లీ స్థానంలో రోహిత్ ను టి 20 కెప్టెన్ గా నియమించింది.

అయితే సౌతాఫ్రికా సిరీస్ కు టెస్ట్ జట్టును ప్రకటించే సమయంలో వన్డే కెప్టెన్ గా కూడా రోహిత్ కొనసాగుతాడని బిసిసిఐ ప్రకటించింది. ఈ నిర్ణయం తనకు ముందుగా తెలియజేయలేదని కోహ్లీ మనస్తాపం చెందాడు. అప్పటినుంచి కోహ్లీకి బిసిసిఐ కి మధ్య దూరం పెరిగింది.  కోహ్లీ వన్డే సిరీస్ కు దూరంగా ఉంటునట్లు వార్తలు రావడం, కొన్ని రోజుల తర్వాత కోహ్లీ వాటిని  ఖండించడం కూడా జరిగింది.

2014-15 సీజన్ లో టెస్టు జట్టు కెప్టెన్ గా  ధోనీ నుంచి కోహ్లీ బాధ్యతలు స్వీకరించాడు.  కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చూపింది. స్వదేశంతో పాటు విదేశాల్లో మొత్తం 68 టెస్ట్ మ్యాచ్ లు ఆడితే వాటిలో 40 విజయాలున్నాయి అయితే . రెండేళ్లుగా కోహ్లీ వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి, మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా తీవ్రమైన పని ఒత్తిడి ఉందని, అందుకే తాను టి 20 కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లు కోహ్లీ చెప్పాడు.

కోహ్లీ టెస్ట్ కెప్తెన్సీ నిర్ణయంపై బిసిసిఐ స్పందించింది. టెస్టుల్లో భారత్ కు అపూర్వ విజయాలను అందించిన విరాట్ కోహ్లీకి బీసీసీఐ కృతజ్ఞతలు తెలియజేసింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్