Friday, March 20, 2026
Homeసినిమాఫిబ్రవరి 18న ‘వర్జిన్ స్టోరి’ విడుద‌ల‌

ఫిబ్రవరి 18న ‘వర్జిన్ స్టోరి’ విడుద‌ల‌

Story of a Virgin: ప్ర‌ముఖ నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన‌ సినిమా “వర్జిన్ స్టోరి”. ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ అనేది ఉపశీర్షిక. గతంలో ‘రుద్రమదేవి’, ‘రేసు గుర్రం’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్. ఇటీవల ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ యంగ్ టాలెంట్ తాజాగా ‘వర్జిన్ స్టోరి’ తో హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకం పై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి ఈ చిత్రంతో టాలీవుడ్ లో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు.

సినిమా టీజర్ లో ప్రామిసింగ్ గా కనిపించారు విక్రమ్. అతని యాక్టింగ్ లో ఈజ్ కనిపించింది. ఫ్రెష్ కంటెంట్ తో వర్జిన్ స్టోరి తెరకెక్కినట్లు బ్యూటిఫుల్ విజువల్స్, క్యారెక్టరైజేషన్స్ తో తెలుస్తోంది. విడుదలైన పాటలు ‘మనసా నిన్నలా’, ‘కొత్తగా రెక్కలొచ్చెనా’, ‘బేబీ ఐయామ్ ఇన్ లవ్’ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఇవన్నీ సినిమా పై పాజిటివ్ బజ్ ను, ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

తాజాగా ఈ రొమాంటిక్ మూవీకి పర్ఫెక్ట్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ నెల 18న చిత్రాన్ని థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా సినిమా మెప్పిస్తుందని, రొమాంటిక్ హీరోగా విక్రమ్ కు మంచి పేరొస్తుందని దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular