సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
విరూపాక్ష సినిమా యొక్క ట్రైలర్ ను ఈరోజు దర్శకనిర్మాతలు విడుదల చేయడం జరిగింది. ముందు నుంచి కూడా రకరకాల ప్రమోషనల్ మెటీరియల్ మరియు కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దర్శక నిర్మాతలు ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసారు.ట్రైలర్ మొదలవగానే సాయిధరమ్ తేజ్ ఒక మారుమూల గ్రామానికి వెళుతూ ఉండడం, ఇక అక్కడి నుండి బ్యాగ్ గ్రౌండ్ లో తాను పుట్టి పెరిగిన ఊరును వదిలి వచ్చి 15 ఏళ్ళు అయింది అన్న విషయాన్ని అప్పుడే తెలియజేయగా, అతను ప్రయాణిస్తున్న కారుపై కాకి పడడంతో కథ మొత్తం మలుపు తిరుగుతుంది. ఇక ఊరిలోకి ఎవరు రాకూడదు అనే బోర్డు కూడా కనిపించిన తర్వాత హీరో ఎలా ముందుకు వెళతాడు అనే విషయంపై ఆసక్తి పెరుగుతుంది.
రెండు నిమిషాల 5 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్.. థ్రిల్, మిస్టరీ అంశాలతో ఆకట్టుకుంటోంది. ఓ ఫారెస్ట్ ఏరియాకు 15 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన మహిళ, ఆ తర్వాత వరుసగా హత్యలు.. ఆ చావులకు కారణం తెలుసుకునేందుకు విరూపాక్షగా సాయి ధరమ్ ఏం చేశారు అనేది ఈ సినిమా కథాంశం అని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా అనే డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ అయింది.