Saturday, January 18, 2025
HomeTrending NewsTDP: సత్తా చూపిద్దాం: బాలయ్య పిలుపు

TDP: సత్తా చూపిద్దాం: బాలయ్య పిలుపు

స్వతంత్ర పోరాటాన్ని మనం చూడలేదని, కానీ ఇప్పుడు ఆ స్ఫూర్తితో పోరాడాల్సి ఉందని టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపు ఇచ్చారు. చంద్రబాబు అరెస్టుతో కొందరు ప్రాణాలు కొల్పోయారని, త్వరలోనే  ఆ కుటుంబాలను పరామర్శిస్తానని వెల్లడించారు. “ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. నేను వస్తున్నా.. నేనే ముందుంటా… జనం ఆలోచించాలి.ఇలాగే భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వ నాశనం అవుతుంది” అంటూ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు,  పంచుమర్తి అనురాధ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలతో కలిసి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.  ఆయన మాట్లాడిన  ముఖ్యాంశాలు:

  • సైనికుల్లా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది.
  • ఆలోచించడం కాదు.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది.
  • జగన్ కు మనుషులేంటేనే అలర్జీ.
  • ముచ్చు మూతి పెట్టుకుని ఎంగిలి మెతుకులు- విదిల్చే స్వభావం జగన్ ది.
  • రూ.10 ఇచ్చి.. రూ. 100 గుంజుకునే స్వభావం వైసీపీది.
  • హిందూపురంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే మిగిలింది.. ఇప్పుడు అభివృద్ధే లేదు.
  • మాట తప్పని పార్టీ మాది.
  • మాట తప్పకపోవడం అనేది ఎన్టీఆర్ నుంచి మా పార్టీకి వారసత్వంగా వచ్చింది.
  • చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు.
  • టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసింది.. ఇప్పుడూ అధిగమిస్తాం.
  • ఇప్పుడే కాదు.. ఇంకా కేసులు పెడతారు.
  • జగన్ లండన్ ఎందుకెళ్లారు.
  • ఇవాళే జగన్ ఏపీకి వచ్చాడంట.. ఈ హ్యాంగోవర్ దిగడానికి మరో పది రోజులు పడుతుందేమో..?
  • ప్రజాపక్షాన పోరాడతాం.మన శక్తి యువత.. వారిని స్ట్రీమ్ లైన్ చేయాలి.
  • కానీ జగన్ ప్రభుత్వం గంజాయికి బానిసలుగా మార్చేస్తున్నారు.
  • హిందూపురంలో ప్రభుత్వాస్పత్రిలో పందులు.. పశువులు తిరుగుతున్నాయి.
  • జగన్ ఏపీని ప్రపంచ పటంలో లేకుండా చేశారు.
  • అభూత కల్పనలు సృష్టించి చంద్రబాబు గారిపై కేసు పెట్టారు.
  • అభివృద్ధికి సంక్షేమానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్.
  • ఓటమి తథ్యమనే భయంతో జగన్ ఈ కేసులు పెట్టించినట్టు కన్పిస్తోంది.
  • తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కదా అని చంద్రబాబు గారిని 16 రోజులైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ కేసును సృష్టించారు.
  • స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు సంబంధించి సీమెన్స్ సంస్థతో తొలి ఒప్పందం 2013లో ఒప్పందం కుదుర్చుకుంది.
  • అలాగే ట్రైనింగ్ నిమిత్తం డిజైన్ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
  • సీమెన్స్ సాఫ్ట్ వేర్ సరఫరా చేస్తే.. డిజైన్ టెక్ శిక్షణ ఇచ్చింది.
  • ప్రభుత్వ వాటాగా 10 శాతం
  • హిందూపురంలో మేమూ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో మేళా నిర్వహించాం.రాష్ట్రం మొత్తం మీద 2.13 లక్షల మంది
  • ఆ రోజున తెలుగువాడి ఆత్మాభిమానం కోసం ఎన్టీఆర్ పార్టీని పెట్టారు.
  • చంద్రబాబు హయాంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది.
  • ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేశారు.
  • దేశవ్యాప్తంగా పార్టీలను ఏకం చేసిన ఘనత ఎన్టీఆర్ ది.
  • పార్టీలను ఏకం చేయడం అంటే దేశాన్నే ఐక్యం చేయడమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్