Saturday, November 23, 2024
HomeTrending Newsకేటాయింపులకు లోబడే నిర్మాణం: అనిల్

కేటాయింపులకు లోబడే నిర్మాణం: అనిల్

కృష్ణా బోర్డు కేటాయింపులకు లోబడే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తమకు కేటాయించిన నీరు తప్ప అదనంగా చుక్క నీరు కూడా తాము వాడుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సిఎం జగన్ కూడా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చెప్పిన విషయాన్ని అయన గుర్తు చేశారు. గత ఏడాది 800 టిఎంసిల వరద నీరు సముద్రంలో కలిసిందని, దాన్ని వినియోగించుకోవడం కోసమే కెనాల్స్ సామర్ధ్యం పెంచుతున్నామని వివరించారు. ఇదే పని తెలంగాణా ప్రభుత్వం చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్పా అని ప్రశ్నించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలు కాపాడడంలో రాజీ పడకుండా, ఉన్న విషయాన్ని కల్మషం లేకుండా చెప్పే మనస్తత్వం జగన్ మోహన్ రెడ్డిదని అనిల్ అన్నారు. రెండు తెలుగు రాష్రాలు కలిసుండాలనేది జగన్ ఆకాంక్ష అని అనిల్ పేర్కొన్నారు.

కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్ధ్యాన్ని తెలంగాణ రాష్ట్రం పెంచుకుందని, పాలమూరు-రంగారెడ్డి కొత్త ప్రాజెక్టు చేపట్టారని అనిల్ చెప్పారు. శ్రీశైలంలో 800 అడుగులకు దిగువన తెలంగాణా లో 6 టిఎంసిల నీటిని వాడుకుంటోందని మంత్రి ఆరోపించారు. తాము కొత్త ప్రాజెక్టులు ఏవీ నిర్మించాడంలేదని, ప్రాజెక్టుల సామర్ధ్యం మాత్రమే పెంచుతున్నామని వివరించారు. ఆర్డీఎస్ లో తమకు కేటాయించిన 4 టిఎంసిలు వాడుకునేందుకే నీటిని మళ్ళిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై అభ్యంతరాలు పెట్టడం సరికాదని తెలంగాణకు సూచించారు. చటానికి లోబడే రాయలసీమ లిఫ్ట్, రాజోలిబండ ప్రాజెక్టులు చేపట్టామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్