Saturday, November 23, 2024
HomeTrending NewsNCP : కుటుంబంలో ఎలాంటి సమస్యా లేదు - శరద్ పవార్

NCP : కుటుంబంలో ఎలాంటి సమస్యా లేదు – శరద్ పవార్

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్‌ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై శరద్ పవార్ స్పందించారు. తాజా పరిణామంతో తన కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవని తెలిపారు. ‘తాజా పరిణామంతో కుటుంబంలో ఎలాంటి సమస్యా లేదు. మేము ఇంట్లో రాజకీయాల గురించి చర్చించము. ప్రతి ఒక్కరూ వారి సొంత నిర్ణయాలు తీసుకుంటారు’ అని తెలిపారు.

పవార్ ఈ రోజు ఉదయం సతారా జిల్లాకు బయలుదేరి వెళ్లారు. అక్కడ స్వాతంత్ర్య పోరాట యోధుడు వైబీ చౌహాన్ స్మారకాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ.. ‘నేను నిన్నటి నుంచీ ఎవరినీ సంప్రదించలేదు. ఇప్పుడు సతారాకు బయలుదేరుతున్నా’ అని చెప్పారు. మరోవైపు అజిత్ పవార్ పార్టీని వీడడంపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకుంటారనేదానిపై ఇంకా ఎలాంటి స్పష్టతా లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి పటేల్ మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కాగా, 2024 ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో ఎన్సీపీ చీలిక చర్చనీయాంశమైంది. అయితే, తాజా పరిణామాలతో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ఎలాంటి ఆటంకం లేదని పవార్ స్పష్టం చేశారు. త్వరలోనే బెంగళూరులో ప్రతిపక్ష కూటమి సమావేశం ఉంటుందని వెల్లడించారు.

ఎన్సీపీకి షాక్ ఇచ్చిన పవార్ మేనల్లుడు అజిత్ పవార్.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిఫలంగా మహా సీఎం ఏక్‌నాథ్‌ షిండే అజిత్‌పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. పవార్‌ వర్గం ఎమ్మెల్యేలు తొమ్మది మందిని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఈ అనూహ్య పరిణామాలతో మహరాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఎక్కడ చూసినా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల గురించే వాడీవేడిగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఎన్సీపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితుడైన సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌ కూడా అజిత్‌ పవార్‌తోపాటు చీలిక వర్గంలో చర్చనీయాంశమైంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్