Saturday, June 13, 2026
HomeTrending Newsఆ వీడియోపై విచారణ జరిపిస్తాం: వైవీ

ఆ వీడియోపై విచారణ జరిపిస్తాం: వైవీ

శ్రీవారి ఆలయంపై నుంచి డ్రోన్ కెమెతో చిత్రీకరించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సమగ్ర విచారణ జరిపిస్తామని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.  ఈ వీడియో హైదరాబాద్ నుంచి అప్ లోడ్ అయినట్లు గుర్తించామని, సదరు  కంపెనీని గుర్తించామని, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు,  నిజంగా ఈ వీడియోను చిత్రీకరించారా, లేదా త్రిడి ఫార్మాట్ ద్వారా తయారు చేశారా అన్న దానిపై విచారణ జరిపిస్తామన్నారు.  ఈ వీడియో ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నామని, దాని నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి చెప్పారు.  ఫొటోగ్రఫీ ద్వారా తీసినట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారని, వాస్తవాలు రెండు మూడ్రోజుల్లో బైటికి వస్తాయని చెప్పారు.

ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం ఆనంద నిలయం గోపురంపై విమానాలు, డ్రోన్లు తిరగడం నిషేధమని,  ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి జరిగిన కుట్ర అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular