Monday, February 24, 2025
HomeTrending Newsఏడాది క్రితమే ప్రక్రియ ప్రారంభం: బాలినేని

ఏడాది క్రితమే ప్రక్రియ ప్రారంభం: బాలినేని

Not for diversion: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనను రాష్ట్రంలో 99 శాతంమంది ప్రజలు స్వాగతిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కేవలం కొన్ని చోట్ల మాత్రమే ప్రజలు చిన్న చిన్న అభ్యంతరాలను తెలియజేస్తున్నారని చెప్పారు. సంతనూతలపాడును  ఒంగోలు జిల్లలో కలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన బాలినేని, కందుకూరును రెవెన్యూ డివిజన్ గా కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.  నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఏడాది క్రితమే ప్రారంభించామని, అలాంటప్పుడు ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే అని ఎలా అంటారని బాలినేని ప్రశ్నించారు. ఏపని చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారని వ్యాఖ్యానించారు.

సోము వీర్రాజు కడప వ్యాఖ్యలపై స్పందిస్తూ  అయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదని ఎద్దేవా చేశారు. బిజెపి అధిష్టానం ఆయన్ను అధ్యక్షుడిగా ఎలా నియమించిందో అంటూ అసహనం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్