ఏపీలో పర్యాటక రంగం ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యెక చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రిగా ఆర్కే రోజా సచివాలయంలోని చాంబర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గండికోట నుంచి బెంగుళూరుకు బస్సు సర్వీసును ప్రారంభించే ఫైలుపై రోజా తొలి సంతకం చేశారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు కల్పిస్తామని మంత్రి రోజా చెప్పారు.
అంతకుముందు భర్త సెల్వమణి, కూతురు, కుమారుడితో కలిసి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన నివాసంలో మంత్రి రోజా కలుసుకున్నారు.
Also Read : వనితకు హోం, వైద్యానికి రజని