Monday, February 24, 2025
HomeTrending Newsరైతు ఉద్యమం ఆగదు

రైతు ఉద్యమం ఆగదు

Peasant Movement Rakesh Tikait :

మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన ఎన్నికల జిమ్మిక్కుగా భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ కొట్టిపారేశారు. రాబోయే ఇదు రాష్ట్రాల ఎన్నికల్లో రైతుల వ్యతిరేకత, ఓటమికి దారి తీస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రధానమంత్రి ప్రకటనతో ఉద్యమం ఆగదని పార్లమెంటులో చట్టబద్దంగా జరిగినపుడే ఉద్యమం విరమిస్తామని మహారాష్ట్రలోని పాల్ఘర్ లో రాకేశ్ తికాయిత్ స్పష్టం చేశారు. తొమ్మిది మందితో కూడిన సంయుక్త మోర్చా సమావేశంలో ఈ రోజు భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామన్నారు.

రైతుల మీద మోపిన తప్పుడు కేసుల ఉపసంహరణ, కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ బిల్లుల సమస్యలు పరిష్కారం అయినపుడే ఉద్యమం ఆగుతుందని తికాయిత్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బహుళజాతి కంపనీల ప్రయోజనాలు కాపాడేందుకే పనిచేస్తోందని, రైతులను పట్టించుకోవటం లేదని రాకేశ్ తికాయిత్ వాపోయారు.

Also Read : విద్యుత్ చట్టాలను ఉపసంహరించుకోవాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్