Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్రెజ్లింగ్ కు పూర్వ వైభవం: మంత్రి శ్రీనివాస గౌడ్

రెజ్లింగ్ కు పూర్వ వైభవం: మంత్రి శ్రీనివాస గౌడ్

ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు రెజ్లింగ్ ను నిర్లక్ష్యం చేశారని,  తెలంగాణలో  రెజ్లింగ్ కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నామని  రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస గౌడ్ అన్నారు.  హైదరాబాద్ లో హింద్ కేసరి ఛాంపియన్ షిప్ ను  రెండు సార్లు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.  హైదరాబాద్ లో రెజ్లింగ్ అకాడమీ ల ఏర్పాటు కు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.   హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తోన్న ప్రతిష్టాత్మక హింద్ కేసరి రెజ్లింగ్ ముగింపు పోటీలను  మరో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో కలిసి తిలకించారు. అనంతరం విజేతలకు ‘ గద’ లను బహుకరించారు.

ఈ సందర్భంగా  శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో క్రీడా మైదానాలను నిర్మించి క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరం రెజ్లింగ్, ఫూట్ బాల్, హాకీ, కబడ్డీ లాంటి ఎన్నో క్రీడా అంశాల్లో గతంలో పేరు గడించిందన్నారు. క్రీడా పాఠశాలలో రెజ్లింగ్ క్రీడా పట్ల చిన్న వయస్సు నుండే శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. క్రీడా మైదానాలలో రెజ్లింగ్ కోర్ట్ లను ఏర్పాటు చేసి ప్రోత్సహం అందిస్తామన్నారు. తెలంగాణ ను క్రీడల్లో అగ్రగామిగా నిలిపేలా స్పోర్ట్స్ పాలసి ని రూపొందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో హింద్ కేసరి నిర్వాహకులు, పలువురు మాజీ పైల్వాన్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular