Sunday, November 24, 2024
HomeTrending Newsపరిహారం విషయంలో మాట తప్పం : సిఎం

పరిహారం విషయంలో మాట తప్పం : సిఎం

పోలవరం నిర్వాసితులకు గత ప్రభుత్వం 6లక్షల 86వేల రూపాయల పరిహారం ఇచ్చిందని, దాన్ని 10 లక్షలు చేస్తామని హామీ ఇచ్చామని, దాని ప్రకారం 2021 జూన్ 30న జీవో కూడా ఇచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ఈ విషయంలో మాట తప్పే ప్రసక్తే లేదని, వివిధ సంక్షేమ పథకాల కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఈ పరిహారం కోసం అయ్యే 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఎందుకు వెనకాడతామని ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పోలవరం ప్రాజెక్టుపై టిడిపి సభ్యులు అడిగిన ప్రశ్న సందర్భంగా సిఎం జోక్యం చేసుకొని ప్రాజెక్టు పై వీడియో ప్రెజెంటేషన్  ద్వారా వివరించారు.

 పోలవరం ప్రాజెక్టులో  మొత్తం 1,06,006 కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నాయని, ప్రాజెక్టులో తొలుత 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తామని, మొత్తం నిర్వాసితుల్లో  20,946 మంది  ఈ పరిధిలోకి వస్తారని, మిగిలిన 85,060 మంది నిర్వాసితులు 45.72 ఎత్తు పరిధిలోకి వస్తారన్నారు.

ఇప్పటి వరకూ 14,110 నిర్వాసితులకు పునరావాసం పూర్తి కాగా, ఖర్చు చేసిన మొత్తం 1960.85 లక్షలు

వీరిలో 707మందికి 2014కు ముందే 44.77 కోట్ల రూపాయలతో పునరావాసం పూర్తయ్యింది

2014-19 వరకూ 3,073 మందికి 193 కోట్ల రూపాయలు పునరావాసం కోసం ఖర్చు చేశారు

తమ ప్రభుత్వం  వచ్చిన తరువాత 10,330 మంది నిర్వాసితులకు 1722.78 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.

అక్టోబర్ 2022 లోగా మిగిలిన 6,836కుటుంబాలకూ పరిహారం ఇచ్చే ప్రక్రియ పూర్తి చేశామన్నారు.

చంద్రబాబు నాడు అర్ధరాత్రి పూట లేని ప్యాకేజీ కోసం హడావుడిగా పోలవరం ప్రాజెక్టు తీసుకున్నారని జగన్ ఆరోపించారు. తాము ఈ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిన నిధులు 2,900కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు.

స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్లే ఇటీవలి వరదలకు ఆ వాల్ కొట్టుకుపోయిందని జగన్ వివరించారు.

Also Read: రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్యం బాగుంది: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్