We will look: పెగాసస్ అంశంపై నేడు ప్రాథమికంగా చర్చించామని వచ్చే సమావేశంలో లోతుగా చర్చిస్తామని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై రాష్ట్ర అసెంబ్లీ నియమించిన హౌస్ కమిటీ రెండ్రోజులుగా భూమన అధ్యక్షతన సమావేశమైంది. జూలై 4, 5 తేదీల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. నేడు రెండోరోజు సమావేశం అయిన తరువాత భూమన మీడియాతో మాట్లాడారు.
నాడు జరిగిన అక్రమాలపై సమగ్ర సమాచారం వెలికి తీసి దోషులను ప్రజల ముందు నిలబెడతామని భూమన స్పష్టం చేశారు. నాటి ప్రభుత్వం పూర్తి అప్రజాస్వామిక ధోరణితో, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసి, వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, వారి గోప్యతకు భంగం కలిగించిందని శాసనసభ సంపూర్ణంగా విశ్వసించిందని, దీన్ని తాము కూడా నమ్ముతున్నమన్నారు. తమకు ఏమేమి వివరాలు కావాలో అడిగామని, వచ్చే సమావేశం నాటికి అందిస్తామని అధికారులు తెలిపారని, పూర్తి వివరాలు వచ్చిన తరువాతే మీడియాకు సమాచారం అందిస్తామని భూమన చెప్పారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులను కూడా హౌస్ కమిటీ ముందుకు పిలుస్తామన్నారు. మమతా బెనర్జీ ప్రకటన కంటే ముందే ఈ అంశంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. మమతా బెనర్జీ ఈ విషయమై వ్యాఖ్యానించిన తరువాత అది ప్రజలందరి దృష్టిలోకి వెళ్ళిందన్నారు.
ఒక్క పెగాసస్ కొనుగోలుపై మాత్రమే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల భద్రత,గోప్యతపై జరిగిన దాడిపై కూడా తమ కమిటీ కూలంకషంగా విచారిస్తుందని భూమన తేల్చి చెప్పారు.
Also Read : పెగాసస్ పై హౌస్ కమిటి