Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఏషియన్ ట్రోఫీ సాధిస్తాం : మన్ ప్రీత్ ధీమా

ఏషియన్ ట్రోఫీ సాధిస్తాం : మన్ ప్రీత్ ధీమా

Hockey-Asian Champions:
ఈ ఏడాది ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంటామని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తరువాత జరుతుతున్న తొలి టోర్నీలో  తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు. రేపటి నుంచి బంగ్లాదేశ్ రాజధాని ధాకాలోని మౌలానా భాషాని  స్టేడియం వేదికగా పురుషుల ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2021 ఆరంభం కానుంది. టోర్నీ తొలి రోజు సౌత్ కొరియాతో ఇండియా తలపడనుంది. కొరియా మెరుగైన జట్టు అని, తమ ఆటను దీటుగా ఎదుర్కొనే సామర్ధ్యం ఆ జట్టుకు ఉందని, కానీ సత్తా చాటేందుక…. పూర్తి స్థాయి ప్రదర్శన చూపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మన్ ప్రీత్ సింగ్ వెల్లడించాడు. 2017లో కొరియాతో జరిగిన మ్యాచ్ ను తాము డ్రా చేసుకున్నామని గుర్తు చేశాడు.

ఏషియన్ హాకీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2011 లో మొదలైన ఈ టోర్నీ ఇప్పటివరకూ ఐదుసార్లు నిర్వహించారు. ఇండియా, పాకిస్తాన్ చెరో రెండు సార్లు విజయం సాధించగా 2018లో చివరిసారి జరిగిన టోర్నీలో భారత్, పాకిస్తాన్  జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఇండియా గెలిచిన రెండు సార్లు పాక్ రన్నరప్ గా;  పాక్ గెలిచిన రెండుసార్లు ఇండియా రన్నరప్ గా నిలవడం విశేషం. తొలి నాలుగు టోర్నీల్లో పాల్గొన్న చైనా ఆ తర్వాత ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు. ఆతిథ్య జట్టుగా బంగ్లాదేశ్ ఈసారి పాల్గొంటోంది. ఇండియా, పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్, జపాన్, మలేషియా, సౌత్ కొరియా జట్లు ఈ ఏడాది పాల్గొంటున్నాయి. అయితే మలేషియా జట్టు పాల్గొనడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇండియా జట్టులో పలువురు యువ ఆటగాళ్లకు ఈ టోర్నీలో ఆడే అవకాశం కల్పించారు. ఒలింపిక్స్ కు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా గత రెండేళ్లుగా ఈ యువ ఆటగాళ్లకు జాతీయ జట్టులో అవకాశం కల్పించలేకపోయామని, అందుకే ఈ టోర్నీలో ఆడే జట్టులో చోటు కల్పించామని మన్ ప్రీత్ వెల్లడించాడు. హర్మన్ ప్రీత్ సింగ్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

రేపు సౌత్ కొరియాతో తలపడనున్న ఇండియా జట్టు 15న బంగ్లాదేశ్; 17న పాకిస్తాన్, 18 మలేషియా, 19న జపాన్ లతో తదుపరి మ్యాచ్ లు ఆడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్