Monday, January 20, 2025
HomeTrending Newsనిరుద్యోగులతో కోళ్ళ ఫారాలు :సోము

నిరుద్యోగులతో కోళ్ళ ఫారాలు :సోము

Somu another scheme: రాష్ట్రంలో తమ ప్రభుత్వం త్వరలో అధికారంలోకి వస్తుందని, ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులతో నాటు కోళ్ల ఫారాలు  పెట్టించి ఉపాధి కల్పిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హామీ ఇచ్చారు.  చీప్ లిక్కర్ పై తానుచేసిన వ్యాఖ్యలు అందరికీ తగలాల్సిన చోట తగులుతున్నాయని , మద్యం విధానంపై ప్రశ్నిస్తే ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ఆరు రూపాయలు పడే చీప్ లిక్కర్ క్వార్టర్ ను ఏపీలో 250  రూపాయలకు అమ్ముతున్నారని, నేడు దానిపై కొంతకాలంగా మాట్లాడుతూ ఉంటే రూ. 30 తగ్గించారని చెప్పారు. తాము చాలా అంశాలు ప్రస్తావించ బోతున్నామని, సారా అంశం గురించి మొదలుపెట్టామని వీర్రాజు స్పష్టం చేశారు.

తన వ్యాఖ్యలపై కేటియార్ చేసిన ట్వీట్ పై సోము తీవ్రంగా ప్రతిస్పందించారు.  తెలంగాణా రాష్ట్రానికి ఏటా  60 వేల కోట్ల రూపాయలు మద్యంపై ఆదాయం వస్తోందని, వారు కూడా తన గురించి మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు.

గుంటూరులో జిన్నా టవర్‌ పేరు మార్చాల్సిందేనని, ఈ ప్రభుత్వం మార్చకపోతే మేము అధికారంలోకి వచ్చాక మారుస్తామని వీర్రాజు వెల్లడించారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌తో పాటు ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన వీరన్న అనే ఇంజినీర్‌నూ మనము స్మరించుకోవాల్సి ఉందని సూచించారు. విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి (కేజీహెచ్‌) పేరునూ తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న పేర్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రైతులకు అన్యాయం చేస్తున్నారని, టమాటా రైతులకు కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయలేకపోతోందని ఈ అంశాలపై తాము పోరాటం చేస్తామన్నారు.

రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ తమ వద్ద పరిష్కారం ఉందని. తమకు అధికారం ఇస్తే పరిష్కరించి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : ఆలోచించి మాట్లాడాలి: విపక్షాలపై సోము ఫైర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్