Sunday, January 19, 2025
HomeTrending Newsరాజీ ప్రసక్తే లేదు: సిఎం జగన్

రాజీ ప్రసక్తే లేదు: సిఎం జగన్

No Compromise: ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అడ్డంకులు ఎదురైనా అక్క చెల్లెమ్మలకు, పేదలకు మంచి చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  పేదలకు మంచి చేస్తుంటే కొంతమంది తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారని, కేంద్రం నుంచి నిధులు వస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని, రాష్ట్ర ఆదాయాలు పెరిగితే ఓర్వలేకపోతున్నారని, ప్రజలకు ఏ మంచి జరిగినా కడుపు మంటతో రగిలిపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.  కళ్ళల్లో పచ్చ కామెర్లు, ఒళ్లంతా పైత్యం, బీపీతో బాధపడుతున్నారంటూ మండిపడ్డారు.  అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని పైడివాడలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సిఎం జగన్ లబ్దిదారుల్లో కొందరికి పట్టాలు పంపిణీ చేశారు.  అంతకుముందు బహిరంగ సభలో మాట్లాడిన జగన్ విపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు పదే పదే  ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ తాము చేస్తున్న మంచికి దుష్ట చతుష్టయం అడ్డు తగుతుతోందని, మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని ఉత్తరాంధ్ర లో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తే దాన్ని కూడా అడ్డుకుంటున్నారని విమర్శించారు.  వివక్షకు తావు లేకుండా, లంచాలకు ఆస్కారం లేకుండా పేదలందరికీ లబ్ధి చేకూరుస్తున్నామని అందిస్తున్నామని, ఒక  లక్షా 37 వేలకోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా  అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వేశామని చెప్పారు. ఇంత గొప్పగా ఎవరైనా చేశా అని ప్రశ్నించారు.

చంద్రబాబు సిఎంగా ఉండగా పేదల ఇళ్ళ నిర్మాణాన్ని పట్టించుకోకుండా హైదరాబాద్ లో ప్యాలెస్ కట్టుకోవడంపై దృష్టి పెడితే, అదే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న తాను తాదేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు ఐదేళ్ళ  హయాంలో ఐదు లక్షల ఇళ్లు కట్టిస్తే తాము 31 లక్షల ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టమని, వాటిలో 21 లక్షల ఇళ్ళ నిర్మాణం ఇప్పటికే మొదలుపెట్టామని వివరించారు.

Also Read : విశాఖకు సిఎం జగన్, ఇళ్ళ పట్టాల పంపిణీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్