Monday, June 8, 2026
Homeసినిమా'స్వాతిముత్యం' నుంచి పెళ్లి గీతం

‘స్వాతిముత్యం’ నుంచి పెళ్లి గీతం

గణేష్ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం‘. వర్ష బొల్లమ్మ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పెళ్లి నేపధ్యంలోని గీతం ఈరోజు విడుదల అయింది. కథానాయకుడు గణేష్, నాయిక వర్ష బొల్లమ్మతో పాటు రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ప్రగతి, సురేఖా వాణి తదితరులు ఈ వీడియో చిత్రంలో కనిపిస్తారు. ఈ గీతానికి సాహిత్యాన్ని కె కె అందించగా, మహతి స్వర సాగర్ సంగీతంలో హుషారుగా సాగుతుంది ఈ గీతం. ఈశ్వర్ పెంటి మాస్టర్ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది.

దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ..‘చిత్ర కథాంశం ప్రకారం నాయక, నాయికల పెళ్లి గీతం ఇది. వీరి నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకూ జరిగే వివిధ, సందర్భాలు, సన్నివేశాల సమాహారం ఈ పాట. పట్టణం నేపథ్యంలో చిత్రీకరించిన దీనిని రచయిత కె కె ఎంతో చక్కగా రచించారు. ప్రేక్షకుడు కూడా సహజంగా అనుభూతి చెందేలా చిత్రీకరించడం జరిగింది అన్నారు. దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు “స్వాతిముత్యం” ను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

Also Read : ‘స్వాతిముత్యం’ అక్టోబర్ 5న విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular