14-06-2026 నుంచి 20-06-2026 వరకు
Weekly Horoscope in Telugu:
మేషం (Aries):
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అందరి నుంచి మద్దతు లభిస్తుంది. వ్యవహారాలు విజయవంతం అవుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులను కలుస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సోదరులతో సఖ్యత ఉంటుంది. మాతృసౌఖ్యానికి దూరమవుతారు. స్థిరాస్తి వ్యవహారాలను ఈవారం వాయిదా వేయడం మంచిది. వారం ద్వితీయార్థంలో ఆర్థిక నష్టం లేదా వృథా ఖర్చులు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. నీచపు ఆలోచనలను అదుపు చేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అనవసర జోక్యాలు మానండి.
వృషభం (Taurus):
ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి అడుగులు వేయాలి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. మాట పలుకుబడి తగ్గే సూచనలు ఉన్నాయి. ఇతరుల కారణంగా ఇబ్బంది పడతారు. అకారణ విరోధం గోచరిస్తుంది. వారం మధ్యలో ఆత్మీయులు అండగా నిలవడంతో సమస్య నుంచి గట్టెక్కుతారు. ధైర్యసాహసాలను ప్రదర్శిస్తారు. శుభ ఫలితాలను పొందుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభించవు. వృథా ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. వేళకు భోజనం ఉండదు. దాయాదులు అనుకూలంగా మారతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
మిథునం (Gemini):
భాగ్యప్రదంగా ఉంటుంది. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ధనలాభం గోచరిస్తోంది. ఆదాయ మార్గాలూ పెరుగుతాయి. వాహన యోగం ఉంది. నిరుద్యోగులకు శుభ వార్త అందుతుంది. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. కీలక సమయంలో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయం కీలక విశేష లాభాన్నిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సోదరులు అండదండగా నిలుస్తారు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తోన్న కబురు అందుతుంది. అనవసరంగా ఎవరికీ హామీలనివ్వకండి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ వహించండి. వేళకు భోజనముండదు.
కర్కాటకం (Cancer):
కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక లావాదేవీల్లో మరింత అప్రమత్తత అవసరం. దూర ప్రయాణం గోచరిస్తోంది. ఇంటికి దూరంగా గడపాల్సి రావచ్చు. కోర్టు వివాదాలను నిర్లక్ష్యం చేయకండి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. హామీని నిలుపుకోక పోవడం వల్ల చిక్కుల్లో పడతారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన వివాదాలు వేధిస్తాయ. మిత్రులతోనూ సఖ్యత చెడే సూచన ఉంది. కీలక సమయంలో అదృష్టం వల్ల సమస్య నుంచి గట్టెక్కుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
సింహం (Leo):
అభీష్టం నెరవేరుతుంది. కార్యసాధనలో పరిచయస్తులూ సాయపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయపథంలో సాగుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. రుణ విముక్తికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతాన విషయాలు సంతృప్తినిస్తాయి. కీలక వ్యవహారాల్లో అదృష్టమూ తోడవుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని పెంచుతుంది. వారం మధ్యలో కోర్టు పరమైన చిక్కులు ఎదురవుతాయి. బద్ధకం వదిలి శ్రమించాలి. ఇతరులతో జాగ్రత్తగా మెలగండి.
కన్య (Virgo):
ఈవారం పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. చేపట్టే ప్రతి కార్యమూ విజయవంతంగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం ఉంటుంది. ఇతరులతో వివాదాల్లో మీదే పైచేయింగా ఉంటుంది. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. నిర్ణయాల్లో స్థిరత్వం, ఆలోచనల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి. ప్రయాణాలు వినోదంగా సాగుతాయి. సంతాన సంబంధ విషయాల్లో సంతృప్తిని పొందుతారు. వారం చివరలో కోర్టు చిక్కుల్లో జాగ్రత్త.
తుల (Libra):
చేపట్టిన ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. వ్యవహారాల్లో మీకు ఎదురే ఉండదు. ఉద్యోగులు అత్యంత యోగదాయకమైన ఫలితాలను పొందుతారు. పోటీదారులను వెనక్కి నెట్టి రివార్డులు, ప్రమోషన్లను పొందుతారు. మేలిమి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది. పరిచయస్తులు పెరుగుతారు. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. రుణ విముక్తి యత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృశ్చికం (Scorpio):
శ్రమానంతర సౌఖ్యాన్ని పొందుతారు. ఆటంకాలను తేలిగ్గానే దాటేస్తారు. ఉద్యోగులు విధి నిర్వహణలో అంకిత భావానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. అధికారుల అండతో అభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. చెప్పుడు మాటలను విశ్వసించకండి. కోపాన్ని అదుపు చేసుకోండి. తగాదాలకు దూరంగా ఉండండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
ధనస్సు (Sagitarus):
కీలక వ్యవహారాలకు వారం మొదట్లోనే శ్రీకారం చుట్టండి. ఆశించిన ప్రయోజనాలు అందుతాయి. వస్తు, వాహన సౌఖ్యాన్ని పొందుతారు. అవసరమైన డబ్బు సమకూరుతుంది. సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలను నేర్చుకుంటారు. ప్రయాణాలను ఆస్వాదిస్తారు. బంధువులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. వారం ద్వితీయార్థంలో ప్రతికూలతలకు అవకాశముంది. అపోహలకు ఆస్కారముంది. విచక్షణను ఉపయోగించండి. మోకాలి సమస్యలు పెరుగుతాయి. అధికారుల కోపానికి గురయ్యే సూచనుంది.
మకరం (Capricorn):
శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. బంధువులు, మిత్రులు అండగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. విజ్ఞానాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రయాణం వినోదంగా సాగుతుంది. కుటుంబానికి అవసరమైన వస్తువులను కొంటారు. సంతాన విషయాలు సంతృప్తినిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. తగాదాలు వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
కుంభం (Aquarius):
ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదురైనా.. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగానే ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. చెప్పుడు మాటలను విశ్వసించకండి. జీవిత భాగస్వామి సూచనలతో కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ సభ్యులతో వినోదంగా గడుపుతారు. ప్రయాణాలు సంతోషంగా సాగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. సంతాన సంబంధ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బద్ధకం వద్దు.
మీనం (Pisces):
అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ఆటంకాలు, ప్రతికూల ఫలితాలు ఇబ్బంది పెడతాయి. బుద్ధి నిలకడగా ఉండదు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. శత్రువుల ఎత్తులు ఒత్తిడిని కలగిస్తాయి. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు ఉండదు. ఆలోచనలు వక్రమార్గం పడతాయి. అనుమానాలు పెరుగుతాయి. అభీష్టం నెరవేరదు. వారం చివరి నాటికి పరిస్థితి కాస్తంత కుదుట పడుతుంది. బంధువుల సహకారంతో కీలక వ్యవహారాన్ని చక్కదిద్దుతారు. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.
శుభం భూయాత్
పి.విజయకుమార్
[email protected]

