02-08-2026 నుంచి 08-08-2026 వరకు
Weekly Horoscope in Telugu:
మేషం (Aries):
వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. బ్యాంకు లావాదేవీలు చికాకును కలిగిస్తాయి. కోర్టు కేసులను నిర్లక్ష్యం చేయకండి. అనూహ్యమైన ఖర్చులుంటాయి. సమాజంలో మాట పలుకుబడి తగ్గుతుంది. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. అత్యంత ముఖ్యమైన సమయంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగ మార్పిడి యత్నాలు అనుకూలించవు. నిరుద్యోగులకు మంచి ఫలితాలుంటాయి. కుటుంబ విషయాల్లో నిర్లక్ష్యం తగదు. దూర ప్రయాణం వుంది.
వృషభం (Taurus):
వారమంతా ఉల్లాసంగా గడుస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ విముక్తి యత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. మిత్రులు అన్ని వేళలా అండగా నిలుస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సంతాన సంబంధ శుభ వర్తమానం అందుతుంది. శుభ కార్యాల్లోపాల్గొంటారు. ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు. దూర ప్రయాణాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అనూహ్యమైన ఖర్చులుంటాయి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. బద్ధకం వద్దు.
మిథునం (Gemini):
వారమంతా పట్టింది బంగారం అన్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు అభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. ఉన్నతాధికారుల మన్ననలను పొందుతారు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మేలిమి అవకాశాలు అందివస్తాయి. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. నిర్ణయాల్లో స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. సంతాన సంబంధ శుభ కార్యాల గురించి చర్చిస్తారు. వారం చివరలో ఖర్చులు తగ్గించండి.
కర్కాటకం (Cancer):
చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకోండి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం దిశగా సాగుతారు. సంతానం వృద్ధిలోకి రావడం ఆనందాన్నిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉదర సంబంధ సమస్యలుంటాయి.
సింహం (Leo):
అవరోధాలను అధిగమించాల్సి వుంటుంది. చెప్పుడు మాటలను గుడ్డిగా నమ్మకండి. ఉద్యోగులు పని విషయలో అశ్రద్ధగా వుంటే అధికారుల కోపానికి గురి కావాల్సి వస్తుంది. ఆలోచనలు వక్రమార్గం పట్టకుండా చూసుకోండి. వారం చివరికల్లా పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరించే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంత తీర్థక్షేత్రాలను సందర్శిస్తారు. సంతానం తీరు చికాకు కలిగిస్తుంది. భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు. అవకాశాలను చేజార్చుకోకండి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది.
కన్య (Virgo):
ముఖ్యమైన కార్యాలను వారం ప్రారంభంలోనే చేపట్టండి. ఆశించిన ఫలితం దక్కుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వారం ద్వితీయార్థంలో అన్ని పనుల్లో అప్రమత్తత అవసరం. చెడు దారులు తొక్కే సూచనలు ఉన్నాయి. తగాదాలకు ఆస్కారముంది. చెప్పుడు మాటలను నిర్ధారించుకోకుండా నమ్మకండి. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. బంధు విరోధం వుంది.
తుల (Libra):
చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. ఆర్థికపరమైన చికాకులు తొలగిపోతాయి. బంధువులు తోడుగా నిలుస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అనురాగం వృద్ధి చెందుతుంది. దేహసౌఖ్యాన్ని పొందుతారు. కొత్త విజ్ఞానాన్ని సముపార్జించుకుంటారు. వారం చివరలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇతరులపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఇష్టం లేని పని చేయాల్సి వసతుంది. తగాదాలకు దూరంగా ఉండాలి.
వృశ్చికం (Scorpio):
ప్రారంభంలో స్వల్ప ఒడుదుడుకులు ఎదురైనా.. చాకచక్యంతో అధిగమిస్తారు. వ్యవహారాలన్నింటా విజయం సాధిస్తారు. ధనలాభం గోచరిస్తోంది. ఆర్థిక క్రమ శిక్షణ అలవడుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఇంటికి అవసరమైన నూతన వస్తువులను కొంటారు. వాహన యోగం ఉంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. జీవిత భాగస్వామి సూచనలతో సమస్యలను చక్కదిద్దుతారు. శారీరక, మానసిక ఆనందం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. బంధాలు బలపడతాయి.
ధనస్సు (Sagitarus):
పనులు ఆశించిన రీతిలో సాగవు. ప్రతి చిన్న పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకం కూడా తోడైతే వ్యవహారాలన్నీ చెడిపోతాయి. అభీష్టం నెరవేరే సూచన లేదు. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. స్థిరాస్తి లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీలక సమయాల్లో మీ తెలివితేటలకు గుర్తింపు లభించదు. ఆలోచనలు వక్రమార్గంలో సాగుతాయి. నిరాశను దూరంగా ఉంచాలి. ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టాలి. వారం చివరలో అనుకూలంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం (Capricorn):
చేపట్టిన పనులు ఆశించినట్లే జరుగుతాయి. శుభ ఫలితాలను పొందుతారు. ఆత్మీయుల సహకారం లభితుంది. సోదరుల తోడ్పాటుతో కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది. వస్త్రాభరణాలను సమకూర్చుకుంటారు. స్థిరాస్తి లావాదేవీలను వాయిదా వేయడం మంచిది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సౌఖ్యానికి దూరమవుతారు. బద్ధకం కారణంగా అభీష్టం దూరమవుతుంది. వారం చివరలో డబ్బుకి ఇబ్బందిగా వుంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త.
కుంభం (Aquarius):
అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి పనికీ ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. మాట పలుకుబడి తగ్గుతుంది. మనసుకి కష్టం కలుగుతుంది. మాట తప్పడం వల్ల నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. కుటుంబంలో స్వల్ప చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. సోదరులు అండగా నిలుస్తారు. ఆత్మీయులను కలుస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించవు. మానసిక ఒత్తిడిని జయించాల్సి వస్తుంది. తగాదాలకు దూరంగా ఉండండి.
మీనం (Pisces):
వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ధనలాభం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. సోదరుల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మీయుల కలియిక ఆనందాన్ని పెంచుతుంది. ఇతరుల వల్ల ఇబ్బంది, అకారణ విరోధం గోచరిస్తున్నాయి. తగాదాలకు దూరంగా ఉండండి. వృథా ఖర్చును తగ్గించాలి.
గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.
శుభం భూయాత్
పి.విజయకుమార్
[email protected]

