Saturday, June 13, 2026
HomeTrending Newsసంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం నుంచి మల్యాల వరకు రూ. 20 కోట్లతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులను, నరసింహునిపేటలో రూ. 15 లక్షలతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. కుల సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేశామని, జిల్లాలోని అనేక చోట్ల వీటి నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు.

శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. మన ఊరు- మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ద్యావ వసంత, ఎంపీపీ శోభా సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ రాఘవేంద్ర రావు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular