Tuesday, March 19, 2024
HomeTrending NewsAus Vs WI: వెస్టిండీస్ 283 ఆలౌట్

Aus Vs WI: వెస్టిండీస్ 283 ఆలౌట్

పెర్త్ లో ఆస్ట్రేలియా తో జరుగుతోన్న మొదటి టెస్ట్ లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 283 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  కెప్టెన్ బ్రాత్ వైట్ 61; టి. చందర్ పాల్-51 పరుగులతో అర్ధ సెంచరీలు సాధించారు. షమ్రా బ్రూక్స్-33; బ్లాక్ వుడ్-36; హోల్డర్-27 పరుగులు చేశారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కెప్టెన్ కమ్మిన్స్ చెరో మూడు; లియాన్ రెండు; హాజెల్ వుడ్, గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్ లో 315 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఆసీస్ ఫాలో అవకాశం ఇవ్వకుండా  రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ (ఉస్మాన్ ఖవాజా-6) కోల్పోయి  29 పరుగులు చేసింది. మొత్తంగా 344 పరుగుల ఆధిక్యం ఆసీస్ సంపాదించింది.

Also Read : Steven Smith  Double ton: ఆస్ట్రేలియా భారీ స్కోరు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్