Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్WI Vs RSA: విండీస్ దే టి 20 సిరీస్

WI Vs RSA: విండీస్ దే టి 20 సిరీస్

సౌతాఫ్రికాతో జరిగిన టి 20 సిరీస్ ను అతిథి జట్టు వెస్టిండీస్ కైవసం చేసుకుంది. జోహెన్స్ బర్గ్ లోని ది వాండరర్స్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో విండీస్ 7 పరుగులతో విజయం సాధించింది.

సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. విండీస్ లో రోమానియో షెఫర్డ్-44; నికోలస్ పూరన్-41; బ్రాండన్ కింగ్-36; రీఫెర్-27 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ప్రోటీస్ బౌలర్లలో నిగిడి, నార్త్జ్, రబడ తలా 2; ఏడెన్ మార్ క్రమ్ ఒక వికెట్ పడగొట్టారు.

సౌతాఫ్రికా జట్టులో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 2సిక్సర్లతో 88; రీలీ రోస్సో-42; కెప్టెన్ మార్ క్రమ్ -35 పరుగులతో మంచి పునాది వేసినా ఫలితం లేకపోయింది. 20ఓవర్లు పూర్తయ్యే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 213  పరుగులే చేయగలిగింది.

విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 5; హోల్డర్ ఒక వికెట్ పడగొట్టారు.

అల్జారీ జోసెఫ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’…. జాన్సన్ ఛార్లెస్ కు ‘ ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.

రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి 20 మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు విండీస్ సౌతాఫ్రికాలో పర్యటించింది. టెస్ట్ సిరీస్ ను 2-0 తో… సౌతాఫ్రికా గెల్చుకోగా, వన్డే సిరీస్ 1-1తో డ్రా అయింది. (ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది). టి 20 సిరీస్ ను 2-1తో విండీస్ దక్కించుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్