మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘మీటర్‘. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన మీటర్ చిత్రానికి రమేష్ కడూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. రెగ్యులర్ అప్‌ డేట్‌లతో మీటర్ టీమ్ దూకుడు ప్రమోషన్‌లని చేస్తోంది . రెండు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా, టీజర్ బజ్ పెంచింది.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో ఆయన జోడీగా అతుల్య రవి అలరించనుంది. పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ అబ్బవరం కనిపించనున్న ఈ సినిమా, ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

లవ్ .. రొమాన్స్ .. కామెడీ ..  మాస్ డాన్సులు .. ఫైట్లను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ‘భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి’ అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *