Friday, October 18, 2024
HomeTrending Newsసిలోన్ పరిణామాలపై పశ్చిమ దేశాల ఆందోళన

సిలోన్ పరిణామాలపై పశ్చిమ దేశాల ఆందోళన

Emergency Srilanka : శ్రీలంకలో రెండోసారి అత్యవసరపరిస్థితి విధించాతంపై పశ్చిమ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజల డిమాండ్లను పట్టించుకోకుండా నిర్భందం కొనసాగిస్తే విపరిణామాలు తలెత్తుతాయని శ్రీలంకలోని వివిధ దేశాల రాయబారులు హెచ్చరించారు. నెల రోజులుగా లంక వాసులు శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారని, దక్షిణాసియాలో ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన శ్రీలంకలో ఇలాంటి పరిస్థితులు నేలకోనటం విచారకరమని చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందం సూచించింది.

రెండోసారి అత్యవసరపరిస్థితి విధించటంపై  సిలోన్ లో అమెరికా రాయబారి జూలీ చాంగ్  ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరసనకారులతో చర్చించి, దేశంలో సామరస్య పూర్వక వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని.. ధీర్గకాల ప్రయోజనాల దృష్ట్యా చర్చలే సమస్యకు పరిష్కారమని అన్నారు. నిర్భందం కొనసాగితే అంతర్యుద్దానికి దారితీస్తుందని స్విట్జర్లాండ్ రాయబారి డొమినిక్ ఫర్గ్లార్ హెచ్చరించారు.

5 వారాల క్రితం నిరసనకారులు అధ్యక్ష భవనం ముట్టడించడంతో హింస చెలరేగింది. ఈ హింసలో నిరసనకారులతో పాటు.. పోలీసులు కూడా గాయపడగా.. అప్పుడు ఎమర్జెన్సీ విధించి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి అత్యవసర పరిస్థితి విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశంలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది.

రోజురోజుకీ లంకలో పరిస్థితులు దిగజారుతున్నాయి. ప్రభుత్వం పైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ సాధారణ ప్రజలు సైతం వీధుల్లోకి వస్తున్నారు. ఆహారం, చమురు ధరలు భయంకరంగా పెరిగిపోవడంతో పాటు విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేనే కారణమంటూ దేశ అధ్యక్షుడి ఇంటి వద్ద ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్నారు.

Also Read : లంకలో నిరసనల హోరు.. రాజపక్స రాజీనామాకు డిమాండ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్