Sunday, January 19, 2025
Homeసినిమానాగార్జున 100వ సినిమా ద‌ర్శ‌కుడెవరు?

నాగార్జున 100వ సినిమా ద‌ర్శ‌కుడెవరు?

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రానికి ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ట్రైల‌ర్ తో మెప్పించిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. నాగార్జున కెరీర్ లో ఎంతో ముఖ్య‌మైన 100వ సినిమాకి చేరుకున్నారు. ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం నాగార్జున క‌థ‌లు వింటున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా  ఓ ఇంట‌ర్ వ్యూలో  చెప్ప‌డంతో 100వ సినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనేది ఆస‌క్తిగా మారింది. అంతే కాకుండా 100వ సినిమా కోసం న‌లుగురు ద‌ర్శ‌కులు క‌థ‌లు రెడీ చేస్తున్నార‌ని చెప్పారు. దీంతో ఆ నలుగురు ఎవ‌రు..? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌త కొన్ని రోజులుగా నాగార్జున 100వ సినిమా ద‌ర్శ‌కుడు మోహ‌న‌రాజా అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

దాదాపుగా మోహ‌న‌రాజా చెప్పిన స్టోరీకి నాగ్ ఓకే చెప్పార‌ని టాక్ వినిపిస్తోంది. అలాగే ద‌ర్శకేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కూడా  నాగార్జున 100వ సినిమా కోసం ఓ భ‌క్తిర‌స క‌థ‌ను రెడీ చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అలాగే నాగార్జున అభిమాని చందు మొండేటి కూడా నాగార్జున కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ రెడీ చేశాడ‌ని తెలిసింది. అయితే.. నాగ్ కోసం క‌థ రెడీ చేస్తున్న నాలుగ‌వ ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. నాగ్ కెరీర్ లో ఎంతో ముఖ్య‌మైన 100వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే ల‌క్కీ ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి.

Also Read : అఖిల్.. బాలీవుడ్ మూవీని నాగ్ సెట్ చేశారా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్