Saturday, April 20, 2024
HomeTrending Newsపిల్లలకు టీకాలు ఎందుకు?

పిల్లలకు టీకాలు ఎందుకు?

Vaccinate Children : సహజంగా పిల్లల్లో 99% రోగనిరోధక శక్తి ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లల్లో కోవిద్ వ్యాక్సిన్ ను నిర్బంధంగా వేయాలనటంలో అర్ధం లేదని అంతర్జాతీయ ఔషధ భద్రతా నిపుణుడు – అన్నపరెడ్డి అన్నారు. మొదటి డోస్ పని చేస్తే, రెండవ డోస్, దాని తర్వాత మూడోదో లేక బూస్టర్ డోస్ అంటూ పెద్దల్లో పలుమార్లు వ్యాక్సిన్లు వేసేసిన ప్రభుత్వాలు, ఫార్మా కంపెనీలు ఇప్పుడు పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ప్రముఖ ఎయిమ్స్ డాక్టర్ సంజయ్ కె రాయ్ చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ నిర్బంధంగా అమలుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయం తనను నిరాశ పరిచిందని చెప్పటం గమనించాలని అన్నపరెడ్డి అన్నారు.. అసలు కోవిడ్ కారణంగా మరణాల రేటు ఎంత? వ్యాక్సిన్ వేసిన పిల్లలలో ప్రతికూల ఫలితాల వాళ్ళ వస్తున్నవారి మరణాల రేటు ఎంత అన్న కీలక సమాచారం క్రోడీకరించాక డాక్టర్ సంజయ్ కె రాయ్ చిన్న పిల్లల్లో కోవిడ్ వ్యాక్సిన్లు వేయరాదని ప్రభుత్వానికి సూచించినా డ్రగ్ మాఫియా మాయలో వున్న ప్రభుత్వం పట్టించుకోవటంలేదని ఆయన అన్నారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే డాక్టర్ సంజయ్ కె రాయ్, భారత్ బయోటెక్ కు చెందిన కోవాక్జిన్ అధ్యనానానికి కూడా ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్వెస్టిగేటర్ అని అన్నపరెడ్డి పేర్కొన్నారు.

ఒక అధ్యయనం నెరపుతున్న ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ సూచనలను సైతం కాదన్న ప్రభుత్వం వ్యాక్సిన్ కంపెనీల లబ్ది కోసం పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఆయన పేర్కొన్నారు. సహజంగా క్లినికల్ ట్రయల్స్ విషయంలో పాటించాల్సిన నిభందనల్లో ప్రదానమైన సమాచారానంతర సమ్మతి పత్రం సైతం (ఇంఫార్మ్డ్ కంన్సెన్ట్) పత్రం కూడా లేకుండా, తల్లిదండ్రులకు వాక్సిన్ వల్ల వచ్చే దుష్పరిణామాలను సైతం వివరించకుండా గుంపులు, గుంపులుగా కనీస కోవిడ్ నిభందనలు కూడా పాటించకుండా చేస్తున్న ఈ చర్యల వల్ల ఎందరో పసి పిల్లల ప్రాణాలు బలికాబోతున్నాయని అన్నపరెడ్డి జోస్యం చెప్పారు. వ్యాక్సిన్‌ల వల్ల కలిగే ప్రతికూల ప్రతిచర్యలు/మరణాలకు ఎవరు బాధ్యులు? టీకాల అనంతరం పిల్లల కనీస ఆరోగ్యం పట్ల పట్టించుకునే వారే కరువయ్యారన్నారు.

అసలు వ్యాక్సిన్‌లు ఇస్తున్న వ్యక్తులు నిబంధనల మేరకు ఆ అధికారం కలిగి ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఓప్రక్క ఓమిక్రాన్ సీరియస్‌ కాదంటూనే, మరణ ప్రభావం ఉండదని చెబుతూనే? మీడియా, ప్ఫార్మా కంపెనీలు, ప్రభుత్వాలు కుమ్ముక్కై పసిపిల్లల జీవితాలతో ఆడుకోవడం సహించరానిదన్నారు. ప్రజల్లో ఈమేరకు అవగాహన కల్పించడానికి, నిభందనలు పాటిస్తూ సమాచారానంతర సమ్మతి పత్రం ద్వారం తల్లితండ్రులకు సరైన సమాచారం ఇచ్చి టీకాలు వేయటం వలన ప్రభుత్వం మరింత పారదర్సకంగా పనిచేస్తుందన్న పేరు వస్తుందని అన్నపరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య క్రీడలో రాష్ట్ర ప్రభుత్వాలు చిక్కుకోకుండా … చిన్నపిల్లలా వ్యాక్సిన్ల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాలని అన్నపరెడ్డి సూచించడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్